ఓటర్ల జాబితా పకడ్బందీగా రూపొందించాలి


Wed,March 20, 2019 01:51 AM

-జిల్లా ఎన్నికల అధికారి, -కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల రూరల్ : మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల నిర్వహణకు గ్రామ పంచాయ తీల వారీగా ఓటర్ల జాబితా పకడ్బందీగా రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసి, ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిం చినట్లు తెలిపారు. ఒక కుటుంబంలోని సభ్యులందరినీ ఒకే వార్డులోకి వచ్చేలా జాబితాలో పొందుపర్చినట్లు తెలిపా రు. ఈ జాబితాపై ఆక్షేపణలు ఉంటే ఈ నెల 20లోగా సంబంధిత మండల అభివృద్ధి అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. 23న ఆక్షేపణల పరిష్కారం, 27న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని వివరించారు. 30న మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందన్నారు.ఈ ఓటరు జాబితా పై అవగాహన కల్పించి ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా లో పేరు నమోదు కాని వారు ఫారం-6 ద్వారా బూత్ స్థాయి అధికారులు, తహసీల్దార్‌కు దరఖాస్తు ద్వారా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పు లు, తొలగింపుల కోసం రాజకీయ పార్టీ ల వారు సంబంధిత బూత్‌స్థాయి అధికారి సమన్వయంతో జాబితా తయారు చేస్తామని వెల్లడించారు. చునావ్ పాఠశాల ద్వారా వీడియో ప్రదర్శన నిర్వహిస్తు ప్రజల్లో ఓటు హక్కు వినియోగంతో పాటు ఈవీఎం లు, వీవీ ప్యాట్లు, కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 28నుంచి ఫొటో తో కూడిన ఓటరు స్లిప్‌లను పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. డీపీఓ వీర బుచ్చయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...