మహిళలూ రక్తదానం చేయాలి


Wed,March 20, 2019 01:51 AM

-కలెక్టర్ భారతి హోళికేరి
-బబ్బెరచెలుకలో మెగా రక్తదాన శిబిరం
కోటపల్లి : రక్తదాతలు నిజమైన ప్రాణదాతలని, మహిళలు సైతం రక్తదానం చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మండలంలోని బబ్బెరచెలుకలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కలెక్టర్ మాట్లాడారు. రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చునని చెప్పారు. మహిళలు నిర్భయంగా రక్తదానం చేయవచ్చునని తెలిపారు. నేడు జిల్లాలో ఎంతోమంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, అలాంటి వారికి మనం అందించే రక్తం ప్రాణప్రదమని అన్నారు. రక్తదాతలను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఏపీఎం రాజన్న, ఏపీఓ వెంకటేశ్వర్లు, బబ్బెరచెలుక సర్పంచ్ ఆసంపల్లి శంకరమ్మ, ఎంపీటీసీ ఆసంపల్లి రాయపోసు, హెచ్‌ఎం గాడిపెల్లి బాపు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలి ..
పారిశుధ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలని కలెక్టర్ భారతి హోళికేరి పిలుపుచ్చారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలోనే కోటపల్లి, వేమనపల్లి, భీమిని మండలాలు వెనుకబడి ఉన్నాయని గుర్తుచేశారు. సర్పంచులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...