నకిలీ నోట్ల కేసులో ఎవరిని వదిలిపెట్టం


Wed,March 20, 2019 01:49 AM

-ఏసీపీ గౌస్‌బాబా
లక్షెట్టిపేట : నకిలీ నోట్ల చలామణి కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని మంచిర్యాల ఏసీ పీ గౌస్‌బాబా పేర్కొన్నారు. మం గళవారం పట్టణంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నకిలీ నోట్ల చెలామణి కేసు విషయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఓ రైతుకు పత్తి వ్యాపారి ద్వారా జరిగిన లావాదేవీల్లో భాగంగా రూ.లక్ష 15 వేలు అందజేయగా, అందులో రూ.50 నోట్లు 9 నకిలీగా గుర్తించి మల్యాల జగన్ అనే పత్తి వ్యాపారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. రామగుండం కమిషనరేట్‌తోపాటు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ఇంటెలిజెన్స్ బృందాలు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారణ చేస్తుండగా, పురోగతి సాధించినట్లు ఏసీపీ తెలిపారు. నకిలీ నోట్ల కేసు విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సరికావన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తారనీ, నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు (నమస్తే తెలంగాణ కాదు) వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు వక్రీకరించి రాస్తున్నారని పేర్కొన్నారు. దొంగనోట్ల కేసు విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను గుర్తించడంతో పాటు విచారణ లోతుగా జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగపురి శ్రీనివాస్, ఎస్‌ఐ మధుసూదన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...