ఎన్నికలకు పకడ్బందీ చర్యలు


Wed,March 20, 2019 01:49 AM

-బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్
-తాండూర్‌లో పోలీస్ చెక్‌పోస్ట్ ప్రారంభం
తాండూర్ : ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామనీ, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ బాలూజాదవ్ కోరారు. తాండూర్‌లో రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు, సిబ్బందితో సమావేశమయ్యారు. స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికలు ముగిసే దాకా కొనసాగే చెక్‌పోస్టు వద్ద మూడు బృందాలతో 24గంటలు తనిఖీ చేయాలని పోలీసులకు సూచించారు. అనంతరం మండలానికి సంబంధించిన వివరాలను సీఐ ఉపేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. మ ద్యం, నగదు, బంగారం, వెండి రవాణాతో పాటు అనుమానితుల వివరాలు తెలిస్తే వెంటనే సిబ్బందికి సమాచారమివ్వాలని కోరారు. ఇక్కడ మాదారం ఎస్సై బి.రాములు, తాండూరు అదనపు ఎస్సై గంగా రాం, ఆర్‌ఐ ప్రభులింగం, నాయకు లు చందు, మేడి సత్యనారాయణ ఉన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...