సరిహద్దుపై నిఘా పెట్టాలి


Wed,March 20, 2019 01:49 AM

-అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-మద్యం, నగదు రవాణాపై దృష్టిపెట్టాలి
-కలెక్టర్ భారతి హోళికేరి
కోటపల్లి : ఎన్నికల నేపథ్యంలో సరిహద్దులపై పటిష్ట నిఘా ఏర్పరచాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట గ్రామం సమీపంలోని ప్రాణహిత నది వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఏర్పాటుచేసిన చెక్‌పోస్టును మంగళవారం జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ నగదు, మద్యం ప్రవాహాలను ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలకు అనువుగా ఉన్న రేవులను గుర్తించి నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్నందున రెండు రాష్ర్టాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేయడంతో పాటు ఫ్ల్లయింగ్ స్కాడ్ ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మద్యం, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవాలని సూచించారు. రాపనపల్లి గ్రామం సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రాణహిత బ్రిడ్జిని పరిశీలించి బ్రిడ్జి నిర్మాణ ప్రగతిని తెలుసుకున్నారు. బ్రిడ్జి ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా మరో వారంలోగా పనులు పూర్తవుతాయని తెలిపారు. కొల్లూరు, ఎర్రాయిపేట గ్రామాల సమీపంలోని గోదావరి నదుల్లో నిర్మించిన తాత్కాలిక రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. గోదావరి గుండా మద్యం, డబ్బు మన ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఈ మార్గాల్లో కూడా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇసుక తవ్వకాలపై ఆరా..
కోటపల్లి మండలంలోని కొల్లూరు, ఎర్రాయిపేట వద్ద గోదావరి నదిలో ఇసుక తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. జయశంకర్ భూపాలపల్లిలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుకను ఎందుకు నిల్వ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇసుక రవాణా చేస్తున్న లారీల వల్ల రోడ్లు దెబ్బతినడమే గాక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లన్నట్లు కలెక్టర్ చెప్పారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...