కాంగ్రెస్‌లో టికెట్ రగడ


Tue,March 19, 2019 12:27 AM

-స్థానికేతరుడికి కేటాయించడంపై అసంతృప్తి
-హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట నిరసన దీక్ష
-తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆగం చంద్రశేఖర్ ఎవరు? ఆయనది ఏ జిల్లా? ఆయన ఏం చేస్తడు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింది? స్థానికేతరుడిని నిలబెట్టడం ఏంటీ? స్థానిక నాయకులు లేరా? ఉన్నా అర్హులు కారా? కనీసం స్థానిక నాయకులను సంప్రదించాల్సిన అవసరం లేదా? ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకుని కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్, వరప్రసాద్ వంటి వారు టికెట్ ఆశిస్తున్నారు. వీరిని కాదని అనామకుడికి టికెట్ కేటాయించడం ఏంటీ? నాలుగు రోజుల క్రితం పార్టీలో చేరిన వారి కి టికెట్ కట్టబెట్టడం ఏందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఆయనకు సహకరించమని ప్రతిన బూనుతున్నారు. కోపంతో రగిలిపోతున్నా రు. రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు.

గాంధీభవన్ ఎదుట నిరసన దీక్ష
స్థానికేతరుడికి టిక్కెట్ కేటాయింపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్‌లోని గాంధీభవ న్ ఎదుట నిరసనకు దిగారు. స్థానికేతరుడైన ఆగం చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్, ఆయన అనుచరులు గాంధీభవన్ వద్ద సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణం చంద్రశేఖర్ అని స్పష్టం చేశారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారని, కనీసం పీఈసీ కమిటీకి పార్లమెంట్ అభ్యర్థిగా తనను పరిశీలించమని దరఖాస్తు కూడా చేయని వ్యక్తికి పార్టీని తప్పుదోవ పట్టించి, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ఏమిటని దుయ్యబట్టారు. పెద్దపల్లి పార్లమెంట్‌లో స్థానిక నాయకుడిగా ఉన్న తనకు అవకాశం కల్పించాలని, అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేంత వరకు తాను ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతా నని స్పష్టం చేశారు. నేతలు ఆయనను బుజ్జగించేం దుకు ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా అనడంతో పెద్దపల్లి టిక్కెట్‌కు సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో వేడిని రగిలిస్తోంది.

టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమంటున్న కాంగ్రెస్ నేతలు
ఇలాంటి వ్యక్తికి టిక్కెట్ ఇచ్చిన అధిష్ఠానం సెల్ఫ్‌గోల్ చేసిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ హవా పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో కనీసం పోటీ ఇచ్చే నేతను పెట్టకుండా అలాంటి వారికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రశేఖర్‌కు టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గెలవడానికా? లేక ఓడిపోవడానికా? అర్థం కావడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కాంగ్రెస్ నేత నమస్తే తెలంగాణతో వాపోయారు. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బలమైన నేతలను రంగంలోకి దింపాలి తప్పా ఇలాంటి వ్యక్తులను నమ్ముకుంటే కచ్ఛితంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఒప్పుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే పార్టీకి డిపాజిట్ కూడా రాదని పేర్కొంటున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...