చంద్రశేఖర్‌గౌడ్‌కే ఉద్యోగ సంఘాల మద్దతు


Tue,March 19, 2019 12:19 AM

-భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
-తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘ నేతలకు సమూచిత స్థానం
-తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి
టవర్‌సర్కిల్(కరీంనగర్ జిల్లా) : ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కే మా సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్‌లో కరీంనగర్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో ఉద్యోగులు కేవలం విధి నిర్వహణలో ఉండేవారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఉద్యమించి రాష్ర్టాన్ని సాకారం చేసుకున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఆ సంఘ నేతలకు స్పష్టమైన అవగాహన ఉంటుందని, చట్టసభల్లో వారికి అవకాశం కల్పిస్తే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయన్నారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకోవడం జరుగుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘ నేతలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, స్వామిగౌడ్‌కు శాసనమండలి చైర్మన్‌గా, శ్రీనివాస్‌గౌడ్‌ను మంత్రిగా, విఠల్‌ను టీఎస్‌పీఎస్సీ సభ్యునిగా నియమించి గౌరవించడంపై ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పోటీలో ఉన్న చంద్రశేఖర్‌గౌడ్ తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీల పాత్ర పోషించారని, ఆయనకు ఇంకా 12 ఏళ్ల సర్వీసు, ఐఏఎస్ హోదా లభించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయనను భారీ మోజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్, ట్రెజరర్ రామినేని శ్రీనివాస్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, డీటీఓ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కొండాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్‌రావు, సుద్దాల రాజయ్యగౌడ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి కాళీచరణ్, అసోసియేట్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, హర్మీందర్‌సింగ్, కిరణ్, శంకర్, ప్రవీణ్, అక్బర్ హుస్సేన్, మామిడి రమేశ్, వేముల రవీందర్, రఘరాం, రాంకిషన్‌తోపాటు పలు సంఘా ల నేతలు పాల్గొన్నారు.

యూనియన్ నాయకులకు ఘన స్వాగతం
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు కరీంనగర్‌కు వచ్చిన ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు సత్యనారాయణ, అరుణ్‌కుమార్, రవీందర్, కృష్ణమూర్తి, కృష్ణ యాదవ్‌లను ఎక్సైజ్‌భవన్‌లో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఎక్సైజ్ భవన్ కార్యదర్శి తాతాజీ, అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు చంద్రశేఖర్, పులి నగేశ్‌గౌడ్, కిషన్, రాజేందర్‌రెడ్డి, కరుణాకర్, లతీఫ్, సుధాకర్, మోహన్‌లాల్, అశోక్, శివకుమార్, శంకర్, భూమయ్య పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...