పౌష్ఠికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం


Tue,March 19, 2019 12:17 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు పౌష్ఠికాహారం తీసుకుంటేనే వారికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ ఏసీడీపీఓ రేష్మ అన్నారు. సోమవారం పట్టణంలోని ఇస్లాంపురలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఏసీడీపీఓ మాట్లాడారు. కిశోర బాలికలకు రక్తహీనతపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు తప్పని సరిగా పౌష్ఠికాహారం తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్ఠికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సాల్మ సుల్తానా, అంగన్ వాడీ టీచర్లు సరోజ, సబియా, పద్మ, జయ, శారద, అంగన్ వాడీ ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

గర్భిణులకు సీమంతం
మంచిర్యాల రూరల్ : పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హాజీపూర్ మండలంలోని దొనబండ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం గర్భిణులకు సీమం తం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు విజయలక్ష్మి, సరిత, ఆశా వర్కర్లు రజిత, సత్యవతి, బాలింతలు పాల్గొన్నారు. మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్వంలో హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామంలో గర్భిణులకు సీమంతం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, అధ్యక్షురాలు మాధవరపు శృతి, అంగన్‌వాడీ టీచర్ పద్మ, మమత, గోనె ఇందిర, సభ్యులు చిదానంద కుమారి, నాగమణి, మంజుల, పద్మ, శ్రీదేవిగౌడ్, లత పాల్గొన్నారు.
జన్నారం : మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో కేజీబీవీ, కవ్వాల్ హాస్టల్ తాండలోని బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికలకు పోషణ, శుభ్రతపై ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...