రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి


Tue,March 19, 2019 12:16 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: బీటీ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. పట్టణంలోని అర్చనటెక్స్ చౌరస్తానుంచి పోలీస్ స్టేషన్ వరకు రూ. 50 లక్షల నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే పరిశీలించారు. మిగిలిఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌రోడ్‌లో పను లు వెంటవెంటనే చేయాలని, పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు మామిడిశెట్టి వసుంధర, కౌన్సిలర్లు కార్కూరి చంద్రమౌళి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు మినాజ్, మాదాడి హన్మంతరావు, గొంగళ్ల శంకర్, భూమేష్, రాకేష్, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటన
పట్టణంలోని 6వ వార్డు పరిధి దొరగారిపల్లి, 7వ వార్డు పరిధి గోపాల్‌వాడలోఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సోమవారం పర్యటించారు. వార్డుల్లో పాదయాత్రగా కలియ తిరిగారు. స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, రహదారుల విస్తరణ, విద్యుత్ కోతలు, పారిశుధ్యానికి సంబంధించిన సమస్యల ను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందిం చిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్ బగ్గని రవి, నాయకులు అంగల రాజేశం, తదితరులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...