తొలి మోడల్ కాలనీ పూర్తి


Mon,March 18, 2019 12:39 AM

పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో తొలి మోడల్ కాలనీ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో రూ.2.83 కోట్ల వ్యయం తో సుమారు రెండున్నర ఎకరాల స్థలంలో 45 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మిం చారు. ఒక్కో ఇంటికి రూ. 5.04 లక్షలు వెచ్చించగా సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కోసం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షలు వెచ్చించారు. ఒక్కో ఇంటికి రూ. 6.29 లక్షలు ఖర్చు చేశారు. 1125 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఒక్కో ఇంటికి కేటాయించగా ఇందులో 560 చదరపు అడుగుల ఇంటిని నిర్మించారు. 45మంది లబ్ధిదారులకు ఇండ్లను లాటరీ పద్ధతిన కేటాయించారు. పక్కనే మరో 24 ఇండ్ల నిర్మాణం చేపట్టగా గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 69 ఇండ్లు ఒకేచోట నిర్మించడంతో గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన ఈ మోడల్‌కాలనీ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రథమ కాలనీగా రూపుదిద్దుకుంది. సకల సౌకర్యాలు, హంగులతో ఇండ్ల నిర్మించడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. మిగతా చోట్ల కూడా ఇలాగే అన్ని హంగులతో ఇండ్లు సిద్ధమ వుతుండగా.. త్వరలోనే లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించనున్నారు. తాజాగా సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుండడంతో మరింత మంది పేదలకు సొంతింటి కల నెరవేరనుంది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...