హెచ్‌ఎం, డిప్యూటీ హెచ్‌డబ్ల్యూ సస్పెన్షన్


Mon,March 18, 2019 12:38 AM

దేవాపూర్ ఆశ్రమంలో ఇద్దరు విద్యార్థినుల ఆదృశ్యంపై మరో వేటు
కాసిపేట రూరల్: మండలంలోని దేవాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలోని ఇద్దరు విద్యార్థునుల మిస్సింగ్ ఘటనలో మరో ఇద్దరిపై వేటు ప డింది. గత వారం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి, ఎనిమిదో తరగతి విద్యార్థినులు అదృశ్యం కాగా ఉట్నూర్ ఐటీడీఏ అధికారులు విద్యార్థినుల ఆచూకీ గుర్తించి క్షేమంగా పాఠశాలలో అప్పగించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయురాళ్లను ఇప్పటికే సస్పెండ్ చే యగా మరో ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆశ్రమంలో వం తుల వారీగా ఉంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు అరుణ, చంద్రకళను గత వారమే సస్పెండ్ చేసిన అధికారులు, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం శైలజతో పాటు డిప్యూటీ హెచ్‌డబ్ల్యూ సుశీలను స స్పెండ్ చేసినట్లు డీటీడీవో సంజీవరావు తెలిపారు. గత వారం ఉపాధ్యాయురాళ్లను సస్పెండ్ చేయగా హెచ్‌ఎం, వార్డెన్‌పై చర్యల కోసం ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య నోడల్ ఆఫీసర్ కాగా నివేదిక పంపగా హెచ్‌ఎంను, వార్డెన్‌ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీటీడీవో వివరించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...