ప్యాసింజర్ టూ పుష్‌పుల్


Mon,March 18, 2019 12:38 AM

-మారిన రామగిరి, సింగరేణి పేర్లు
-ఈ నెల 25 నుంచి అమల్లోకి..
మంచిర్యాల అగ్రికల్చర్: రామగిరి, సింగరేణి ప్యాసింజర్ రైళ్లు ఇక నుంచి పుష్‌పుల్ గా మారనున్నాయి. 25వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు సమాచారం. కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే రామగిరి, భ ద్రాచలం రోడ్ - బల్లర్షాల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైళ్లు ఇప్పటి వరకు మామూ లు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. అంటే 12 జనరల్ బోగీలు, రెండు స్లీపర్ బోగీలతో కలిపి 14 కోచ్‌లతో నడుస్తున్నాయి. బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్‌ల నుంచి ఇవి తిరుగు ప్రయాణం సమయంలో అక్కడి రైల్వే స్టేషన్‌లో సమయం ఎక్కువ తీసుకుంటున్నాయి. దీంతో అవి ఆలస్యంగా నడుస్తుంటాయి. దీన్ని నివారించేందు కే పుష్‌పుల్ కోచ్‌లతో వీటిని నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టీఫుల్ యూనిట్ (ఎంఈఎంయూ) రైల్‌లో మూడు మోటారు కారు(ఎంసీ)లు, తొమ్మిది ట్రావెలింగ్ కారు(టీసీ)లతో కలిపి 12 కోచ్‌లుండనున్నాయి. ఇవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. కాబట్టి వీటిలో ఒక కోచ్‌లో అత్యవసర మరుగుదొడ్డి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు సమాచారం.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...