సమస్యాత్మక నేలలపై డీలర్లకు శిక్షణ


Mon,March 18, 2019 12:38 AM

బెల్లంపల్లి రూరల్: బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం లో ప్రధాన భూసార శాస్త్రవేత్త, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్‌నాయక్ కుమ్రం భీం ఆసిఫాబాద్‌కు చెందిన విత్తన, ఎరువుల డీలర్లకు సమస్యాత్మక నేలలు-వాటి యాజమాన్యంపై ఆదివారం శిక్షణ ఇచ్చా రు. డాక్టర్ రాజేశ్వర్ నాయక్ మాట్లాడుతూ భూమి ఉపరితలంపై ఉన్న ఆరు అంగుళాల నేల ప్రపంచ జ నాభా ఆకలిని తీరుస్తుందన్నారు. ఒక అంగుళం నేల ఏర్పడేందుకు సుమారు 600 నుంచి వెయ్యేండ్ల కాలం పడుతుందన్నారు. మనది పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశంగా చెప్పుకోవాలన్నారు. దేశం లో 70 శాతం ప్రజలు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. నేల ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యమన్నారు. అందుకు భూసార పరీక్ష విధానాలను రైతులు తప్పని సరిగా తెల్సుకోవాల్సిన అవస రం ఉందన్నారు. సమస్యాత్మక నేలలు- వాటి యా జమాన్యాలపై వివరించారు. వ్యవసాయ రంగంలో ద్రవరూప ఎరువుల వాడకం, ఉపయోగాలను వివరించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువగా చౌడు నేలలు ఉన్నాయనీ, వరి వేసిన తర్వాత దుక్కి సమస్యలు అధికంగా వస్తాయన్నారు. శిక్షణలో జిల్లాకు చెందిన విత్తన, ఎరువుల డీలర్లున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...