తగ్గుతున్న రక్త నిధి


Mon,March 18, 2019 12:37 AM

-ఆందోళన చెందుతున్న తలసేమియా బాధితులు
-అత్యవసర సమయాల్లో రోగులకుతప్పని ఇబ్బందులు
మంచిర్యాల అగ్రికల్చర్ : మంచిర్యాల బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు రోజు రోజుకూ తగ్గుతుండడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. శస్త్ర చికిత్సలకు, అత్యవసర చికిత్సలకు, రక్త క్షీణత వ్యాధులతో బాధపడే వారికి అవసరమయ్యే రక్తం యూని ట్లు నిల్వ లేకపోవడంతో బాధితులు అల్లాడుతున్నా రు. రక్తం అవసరం బాగా పెరిగింది. ప్రసవాలకు సంబంధించి అధిక శాతం మందికి ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం అవసరమవుతుంది. ప్రతి వంద మంది గర్భిణుల్లో 70 నుంచి 80 మంది రక్త హీనతతో వ స్తుండడం, మరోవైపు శస్త్ర చికిత్సలు అవసరమున్న వారికి, ప్రమాదంలో గాయపడి రక్తం కోల్పోయిన వారందరికి రక్తం అవసరమవుతుంది. సరైన సమయంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక వైద్యులు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు.

ఇది కేవలం ఒక మంచిర్యాల ఐఆర్‌సీఎస్ బ్లడ్ బ్యాంకు పరిస్థితే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్, నిర్మల్‌లోని ఐఆర్‌సీఎస్ బ్లడ్ బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. వీటితో పాటు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రైవే టు బ్లడ్ బ్యాంకులోనూ రక్తం నిల్వ కొరతే ఉంది. జిల్లాలోని ఐఆర్‌సీఎస్ బ్లడ్ బ్యాంకుల్లో సేకరించిన రక్తపు యూనిట్లనే మరో సబ్ స్టోరేజ్ సెంటైర్లెన చెన్నూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, అప్పుడప్పుడు ఉట్నూర్, భైంసా దవాఖానలకు తరలించాల్సి ఉంటుంది. ప్రధాన కేంద్రాల్లోనే ఈ కొరత ఉందంటే ఇక సబ్ సెంటర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

నెగెటివ్ రక్తం కొరత అధికం...
నెగెటివ్ గ్రూపుల రక్తం కొరత అధికంగా ఉంది. వారం రోజులుగా నెగెటివ్ రక్తం నిల్వలను పరిశీలిస్తే మరీ దారుణంగా ఉంది. మంచిర్యాల బ్లడ్ బ్యాంకు లో జనవరిలో పరిశీలించినైట్లెతే 14 క్యాంపుల ద్వారా 780 యూనిట్లు సేకరించగా, స్వచ్ఛందంగా 31 మంది రక్తదానం చేశారు. ఇందులో ఏ+ 158 యూనిట్లు, ఏ- 5 యూనిట్లు, బీ+ 225 యూనిట్లు, బీ- 12 యూనిట్లు, ఏబీ+ 40 యూనిట్లు, ఏబీ- ఒక యూనిట్, ఓ+ 354 యూనిట్లు, ఓ-16 యూనిట్లు ఇలా మొత్తం 811 యూనిట్లు సేకరించారు. ఫిబ్రవరిలో ఏడు క్యాంపు ల ద్వారా 555 యూనిట్లు సేకరించగా, 85 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇందులో ఏ+ 123 యూనిట్లు, ఏ- ఐదు యూనిట్లు, బీ+ 185 యూనిట్లు, బీ- 8 యూనిట్లు, ఏబీ+ 39 యూనిట్లు, ఏబీ- 0 యూనిట్లు, ఓ+ 271 యూనిట్లు, ఓ- 11 యూనిట్లు ఇలా మొత్తం 640 యూనిట్లు సేకరించారు. అదే ఈ పది రోజు ల్లో పరిస్థితి మరీ దారుణం.. నెగెటివ్ గ్రూపులో రక్తం నిల్వలే కరువు. సేకరిద్దామనున్నా మార్చిలో ఎండలు ముదరడం, మరోవైపు పరీక్షల కారణంగా యువకులు అధికంగా పాల్గొనకపోవడం, అక్కడక్కడ క్యాంపులు ఏర్పాటు చేసినా నెగెటివ్ గ్రూపుల్లో రక్తం సేకరించలేకపోతున్నారు.

ఇదే అదనుగా వ్యాపారం...
రక్త నిల్వలు అతి తక్కువగా ఉన్న తరుణంలో ఇదే అదనుగా కొందరు దళారులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకులో రక్తం అవసరం ఉన్న వారికి రక్త నిల్వల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చాలా వరకు తప్పకుండా డోనర్‌ను తీసుకురావాలని చెబుతున్నారు. ప్రభుత్వ దవాఖానలో ఎమర్జెన్సీ ఉన్న వారికి, తలసేమియా వ్యాధిగ్రస్తులకు జనవరిలో 752 యూనిట్లు ఇవ్వగా ఇందులో ఏ+ 153 యూనిట్లు, ఏ- ఒక యూనిట్, బీ+ 232 యూనిట్లు, బీ- 13 యూనిట్లు,ఏబీ+ 48 యూనిట్లు, ఏబీ- 2 యూనిట్లు,ఓ+ 291 యూ నిట్లు, ఓ- 12 యూనిట్లు అందజేశారు. ఫిబ్రవరిలో 809 యూనిట్ల రక్తాన్ని పంపిణీ చేశారు. ఇందులో ఏ+ 155 యూనిట్లు, ఏ- 12 యూ నిట్లు, బీ+ 204 యూనిట్లు, బీ- 8 యూనిట్లు, ఏబీ+ 35 యూనిట్లు, ఏబీ- 0 యూనిట్లు, ఓ+ 381 యూనిట్లు, ఓ- 14 యూనిట్లు అం దించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో గర్భిణులకు, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రక్తం అవసరముంటుండగా, నిల్వలు లేకపోవడంతో దళారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అత్యవసర సమయంలో రక్తం ఇచ్చేందుకు రూ. 2500 నుంచి రూ. 3వేలు వసూలు చేస్తున్నారు. నెగెటివ్ గ్రూపు వారికైతే డిమాండ్ మరీ పెరిగింది.

ఈ నెల 17 వరకు నిల్వలు
మార్చి నెల ఆరంభం నుంచే రక్త నిలువలు కొరత మరింత తీవ్రతరమైంది. మార్చి ఒకటో తేది నుంచి పదో తేది వరకు నెగెటివ్ బ్లడ్ గ్రూపులను పరిశీలిస్తే ఏబీ- జీరో ఉండగా ఏ మొదటి వారం రోజులు జీరో ఉండగా చివరి మూడు రోజులు రెండు యూనిట్ల చొప్పున నిలువ ఉన్నాయి. బీ- 11 యూనిట్లు, ఓ- 20 యూనిట్లు ఉన్నాయి. ఈ నెల 10న మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో నాలుగు క్యాంపులు నిర్వహించగా ఈ మాత్రం యూనిట్లు ఉన్నాయి. ఈ నాలుగు క్యాంపుల ద్వారా వారం రోజుల వరకు నెట్టుకొచ్చినా తిరిగి అదే పరిస్థితికి చేరుకుంది.

మావంతు ప్రయత్నం చేస్తున్నాం
ఏటా వేసవిలో రక్తం నిల్వలు తగ్గుతుంటాయి. ఒక వైపు ఎండలు, మరోవైపు కళాశాల విద్యార్థులకు పరీక్షలు ఉండడంతో రక్తం ఇచ్చేందుకు యువత ముందుకు రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ సమయంలో రక్తం ఇస్తే ఇబ్బందులకు గురవుతామనే భయంతో చాలా వరకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనితో రక్తం నిల్వలు తగ్గుతున్నాయి. ప్రధాన కేంద్రాల్లో రక్తం ఉంటేనే సబ్ స్టోరేజీ సెంటర్లలో రక్తం అందుబాటులో ఉం టుంది. జిల్లా వ్యాప్తంగా నిల్వలు తగ్గడంతో తలసేమియా బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రధానంగా నెగెటివ్ గ్రూపు రక్తం దొరకడం కష్టమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇతర పట్టణాలకు వెళ్లి రక్తాన్ని తెచ్చుకోమని సూచిస్తున్నాం. మావంతుగా వ్యాపారులను, పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలను రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నాం. మండలాల వారీగా యువతను చైతన్య పరుస్తూ క్యాంపులకు సహకరించాలని కోరుతున్నాం. మందమర్రి జీఎంను కలిసి వొకేషనల్ శిక్షణకు హాజరయ్యే అభ్యర్థుల ద్వారా క్యాంపు నిర్వహించాలని కోరగా అంగీకరించారు. ఈ ఏడాది వెయ్యి యూనిట్లు ఇచ్చేందుకు ఆయన హామీ ఇచ్చారు. ఇతర జిల్లాల్లో సైతం సేకరిస్తున్నం. సోమవారం రక్తం కావాలని సుమారు 15 మంది తలసేమియా బాధితులు వారి పేర్లు నమోదు చేసుకున్నారు. మా వంతుగా మేం కృషి చేస్తున్నాం.
-భాస్కర్ రెడ్డి, ఐఆర్‌సీఎస్ చైర్మన్, మంచిర్యాల

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...