కళ్లుగప్పి డబ్బులు డ్రా చేసిన వ్యక్తి అరెస్ట్


Sun,March 17, 2019 02:19 AM

-ఏటీఎం పని చేయడం లేదని, ఆసలు కార్డుతో నగదు నొక్కేసిన వైనం
-నాలుగు ఏటీఎం కార్డులు, రూ.14,500 నగదు స్వాధీనం
మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ : డబ్బులు డ్రాచేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వచ్చిన వ్యక్తిని ఏమార్చి అతడి కార్డును ఉపయోగించి డబ్బును డ్రా చేసిన గంధం మహేందర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు మంచిర్యాల పట్టణ సీఐ ఎడ్ల మహేశ్ తెలిపారు. శనివారం మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచే సిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని లక్ష్మీటాకీసు చౌరస్తాలో చెరుకు రసం అమ్ముకునే సింద క్రిష్ణ అనే వ్యక్తి ఈ నెల 12న డబ్బులు డ్రా చేసుకునేందుకు ఐబీ చౌరస్తాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. కార్డును ఏటీఎంలో పెట్టి డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నించగా సాంకేతిక కారణాలతో అందులో నుంచి డబ్బు రాలేదు. అతడి వెనకాలే ఉన్న పాతబెల్లంపల్లికి చెం దిన గంధం మహేందర్ చూసి ఓసారి నీ కార్డు ఇవ్వు నేను ట్రై చేస్తానని చెప్పి క్రిష్ణకు సాయం చేస్తున్నట్లు నటించాడు.

కార్డును ఇవ్వగానే ఏటీఎంలో పెట్టి పిన్‌నెంబర్ అడిగాడు. నెంబరు తెలుసుకున్నాక ఏటీఎం పనిచేయడం లేదని చెప్పి కార్డును తిరిగి ఇచ్చాడు. అయితే కార్డు క్రిష్ణకు తిరిగి ఇచ్చే క్రమంలో మహేశ్ వద్ద అప్పటికే ఉంచుకున్న పాత కార్డులలో ఒకటి ఇవ్వాల్సి ఉండగా కంగారులో తన సొంత కార్డును చేతిలో పెట్టాడు. ఆ తర్వాత క్రిష్ణ అకౌంట్ నుంచి రూ. 14,500 డ్రా చేసుకున్నాడు. డబ్బులు డ్రాచేసినట్లు క్రిష్ణ సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించి కార్డు బ్లాక్ చేయించాడు. తన కార్డు మారిందని తెలుసుకుని, ఏటీఎంలో కలిసిన వ్యక్తి తనను మోసం చేశాడని గ్రహించిన క్రిష్ణ పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలతో పాటు మహేందర్‌కు చెందిన ఏటీఎం కార్డు ఆధారం గా అతడిని పట్టుకున్నామని సీఐ మహేశ్ తెలిపారు. అతనివద్ద ఉన్న నాలుగు ఏటీఎం కార్డులు, రూ.14,500 నగదును స్వాధీ నం చేసుకున్నట్లు వివరించారు. బెల్లంపల్లి మండ లం పాత బెల్లంపల్లికి చెందిన మహేందర్ కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడనీ, సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఈ పనిని ఎంచుకున్నాడని తెలిపారు. ఏటీఎం కార్డుల పిన్‌కోడ్‌లు, బ్యాంకుల వివరాలు ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ మారుతి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...