కల్యాణ వైభోగమే..


Sun,March 17, 2019 02:19 AM

- ఘనంగా శ్రీనివాసుడి కల్యాణం
- త్రిదండి చినజీయర్‌స్వామి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
మంచిర్యాల కల్చరల్ : శ్రీనివాస కల్యాణం మంచిర్యాల వికాస తరంగిణి ఆధ్వర్యంలోత్రిదండి చినజీయర్‌స్వామి గారి చేతుల మీదుగా శనివారం వైభవోపేతంగా జరిగింది. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఏడు ఉత్సవ మూర్తులతో ప్రథమంగా ఈ కల్యాణాన్ని నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీనివాస కల్యాణ ఉత్సవ కమిటీ జెట్ సభ్యుల ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా వేదపండితుల మధ్య జీయర్‌స్వామి, దేవానంద జీయర్‌స్వామి వారి శిష్య బృందం ముందుగా స్వామి వారికి మంగళస్నానాలతో పాటు గళార్చన నిర్వహించారు. హైటెక్‌సిటీలోని హరహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి, పద్మావతి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించి కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి జీయర్‌స్వామి మాట్లాడుతూ పవిత్ర గోదావరి ప్రవహిస్తున్న మంచిర్యాలలో శ్రీనివాసుడి కల్యాణం నిర్వహించడం శుభపరిణామమన్నారు. అనంతరం వికాస తరంగిణి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో వికాస తరంగిణి సభ్యులు పి.హన్మంతరావు, ఎ.రాజేశ్వర్‌రావు, బీ నర్సింగరావు, జె.యాదగిరిరావు, పోసు, ఇతర మహిళా సభ్యులున్నారు.
వికాసతరంగి భవ నిర్మాణానికి శంకుస్థాపన
మంచిర్యాల జిల్లా జెట్ వికాస తరంగిణి సభ్యులు పట్టణంలోని చేపల మార్కెట్ సమీపంలో నూతనంగా నిర్మించే వికాస తరంగిణి భవనానికి చినజీయర్‌స్వామి శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, భక్తులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...