వంద శాతం పీఎల్‌ఎఫ్ సాధించాలి


Sun,March 17, 2019 02:19 AM

-జైపూర్ ఎస్టీపీపీలో డైరెక్టర్ ఈఅండ్‌ఎం శంకర్
-అధికారులతో సమీక్షా సమావేశం
జైపూర్: ప్రతి నెలా వందశాతం పీఎల్‌ఎఫ్ సాధించాలని డైరెక్టర్ ఈఅండ్‌ఎం శంకర్ పేర్కొన్నారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. మొదటి యూనిట్, రెండో యూనిట్లకు సంబంధించిన కంట్రోల్‌రూమ్‌ని సందర్శించారు. పని ప్రదేశాలను పరిశీలించిన అనంతరం సింగరేణి గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్పత్తికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా మాదిరిగానే 100 శాతం పీఎల్‌ఎఫ్ సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్లాంటు ఆవరణలో గతేడాది మాదిరిగానే చెట్లు నాటాలన్నారు. నాటిన చెట్లను సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం రాజేశ్, జీఎం ఈఅండ్‌ఎం గణపతిరావు, డీజీఎంలు మదన్‌మోహన్, ధనుంజయ్, పీఎం లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...