షెడ్డు తొలగించాలని ఆదేశాలివ్వలేదు


Sun,March 17, 2019 02:18 AM

-బెల్లంపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్) జే.కిరణ్
రెబ్బెన : బెల్లంపల్లి పట్టణం లోని సీఈఆర్ క్లబ్ షెడ్డు తొలగింపునకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్ ఆదేశాలివ్వలేదని బెల్లంపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్) జే కిరణ్ ప్రకటనలో స్పష్టం చేశారు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్ షెడ్డు తొలగింపునకు జీఎం ఆదేశాలు జారీ చేసినట్లు పత్రికల్లో కథనాలు రావడంతో బెల్లంపల్లి పట్టణ కార్మికులు అయోమయానికి గురయ్యామని తెలిపారు. వాస్తవానికి ఏరియాలోని గోలేటి సీఈఆర్ క్లబ్ ఆధునీకరించాలని కార్మికులు, యూనియన్ ప్రతినిధులు పలుమార్లు అభ్యర్థించారని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని పాత వర్క్‌షాప్(ప్రస్తుతం అన్వేషణ విభాగం)లో నిరుపయోగంగా ఉన్న షెడ్డు సామగ్రి తొలగించి వాటిని గోలేటి సీఈఆర్ క్లబ్ కోసం వినియోగించవచ్చని సూచించారని తెలిపారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలోని పాత వర్క్‌షాప్‌లో ఉన్న షెడ్డుతో గోలేటి సీఈఆర్ క్లబ్ విస్తరణ పనులు చేపట్టేందుకు టెండరు నోటీసును జారీ చేస్తామని పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని సీఈఆర్ క్లబ్ షెడ్డు తొలగించటం అ వాస్తవం కావున పట్టణ ప్రజలు, కార్మిక కుటుంబాలు, క్రీడాభిమానులు అందరూ సీఈఆర్ క్లబ్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...