ఒకసారి 3వేలు ఖర్చయ్యేది..


Sun,March 17, 2019 02:18 AM

- కొంక రాయమల్లు, కన్నాలబస్తీ
బెల్లంపల్లి టౌన్ : మాది బెల్లంపల్లిలోని కన్నాబస్తీ. నేను మందమర్రి ఏరియా సోమగూడెం-1 గని ల్యాంప్ రూం సూపర్‌వైజర్‌గా 2003లో రిటైరయ్యాను. అప్పటికే నేను షుగర్‌తో బాధపడుతున్నా. 2015 నుంచి అది ఇంకా ఎక్కువై, ఊపిరితిత్తులు బరువై అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చూపించుకుంటే నా కిడ్నీలు బాగా చెడిపోయాయని డాక్టర్లు చెప్పారు. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకోవాలన్న తర్వాత వారం అక్కడే ఉండి ఇంటికి వచ్చాను. మంచిర్యాలలో ప్రైవేట్‌లో డయాలసిస్ చేయించుకున్నా. ఒక్కసారికి రూ.3 వేలు ఖర్చయ్యేది. ప్రయాణ ఖర్చులు కలిపి రూ.5వేలు అయ్యేది. ఇలా ఆర్థికంగా చాలా ఇబ్బందయ్యేది. 2017 నుంచి సింగరేణి నుంచి రెఫర్ చేయించుకుంటే గోదావరిఖని ఏరియా దవాఖాన డయాలసిస్ కేంద్రంలో చేస్తున్నారు. తెలంగాణ సర్కారు వచ్చినంక ఇది అయ్యింది. ఇప్పుడు మంచిర్యాలలో డయాలసిస్ సెంటర్ రావడం వల్ల నాలాంటి ఎంతోమందికి దూరభారంతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చినట్లయ్యింది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...