భారీ మెజార్టీతో గెలిపించుకుందాం


Sat,March 16, 2019 01:05 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ : ఉపాధ్యాయ, పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ మద్దతు పలుకుతున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం మంచిర్యాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనలేని గౌరవమన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారనీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పాతూరి సుధాకర్‌రెడ్డి అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో గౌరవమన్నారు. ఎన్నో ఉపాధ్యాయ సమస్యలను ఒంటిచేత్తో పరిష్కరించిన ఘనత పాతూరి సుధాకర్‌రెడ్డిది అనీ, ఆయన సేవలను, పనితనాన్ని గమనించిన ముఖ్యమంత్రి, మరోమారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఇక పట్టభధ్రుల నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్‌గౌడ్‌ను పార్టీ తరపున పోటీలో నిలపడం జరిగిందన్నారు. ఇప్పటికే నిరుద్యోగుల కోసం అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం, రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు వెలువరించనుందని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు, పట్టభద్రులు, పార్టీ శ్రేణులు పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పాతూరి సుధాకర్‌రెడ్డికి, పట్టభధ్రుల ఎమ్మెల్సీగా బరిలో ఉన్న చంద్రశేఖర్‌గౌడ్‌కు వేసి గెలిపించాలని కోరారు.

పనితీరు చూసి అవకాశం ఇవ్వండి : పాతూరి సుధాకర్‌రెడ్డి
తన పనితీరును చూసి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. 2007 నుంచి 2011 దాకా, 2013 నుంచి ఇప్పటిదాకా తాను ఎమ్మెల్సీగా పనిచేసిన్ల తెలిపారు. ఇన్నేళ్లలో చేసిన పనులు, ఉపాధ్యా య సమస్యల పరిష్కారాన్ని చూసి మరోమారు అవకాశం ఇవ్వాలని కోరారు. 2014లో వేతన సవరణ కమిషన్ సిఫారసులకు మిన్నగా 43 వాతం ఫిట్‌మెంట్ సాధించడంలో తనపాత్ర ఉందనీ, బకాయిల చెల్లింపులపై ప్రత్యేక ప్రస్తావనల రూపంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాననీ, తెలంగాణ ఇంక్రిమెంట్ సాధించడంలో కీలక పాత్ర పోషించానని పేర్కొన్నారు. కాంట్రా క్ట్ లెక్చరర్లకు రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా కనీస వేతనంతో పాటు సంవత్సరం పొడవునా వేతనం చెల్లించేందుకు కృషిచేశానన్నారు. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని చేసిన పోరాటానికి ప్రభుత్వం నుంచి సానుకూ ల స్పందన వచ్చిందన్నారు. సీపీఎస్ రద్దు కోసం కమిటీని వేయాలని ముఖ్యమంత్రిని కోరామనీ, కస్తూర్భా ఉపాధ్యాయులకు గురుకుల ఉపాధ్యాయులతలో సమానంగా వేతనాలు చెల్లించాలని కేంద్రమంత్రిని కోరామని చెప్పారు. సమావేశం లో మంచిర్యాల మున్సిపల్ అధ్యక్షురాలు మా మిడిశెట్టి వసుంధర, ఐసీడీఎస్ ఆర్గనైజర్ అత్తి సరోజ, కౌన్సిలర్లు కార్కూరి చంద్రమౌలి, కో ఆప్షన్ సభ్యుడు తోట తిరుపతి, పీఆర్టీయూ నాయకులు పర్వతి సత్యనారాయణ, వేణుగోపాల్, టీయూటీఎఫ్ నాయకులు ప్రేమ్‌రావు, బన్న రవీందర్, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...