చంద్రశేఖర్‌గౌడ్‌కే మా మద్దతు


Sat,March 16, 2019 01:05 AM

మంచిర్యాల రూరల్: టీఆర్‌ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతిస్తున్నట్లు తెలంగాణ నాన్ గెజిటెడ్ (టీఎన్‌జీఓ) ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి సురేశ్ బాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సంఘం కార్యాలయానికి వచ్చిన చంద్రశేఖర్ గౌడ్‌కు స్వాగతం పలికారు. అధ్యక్షు డు సురేశ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి పిలుపు మేరకు చంద్రశేఖర్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి ఉద్యోగి తమ మొదటి ప్రాధాన్యత ఓటును చంద్రశేఖర్ గౌడ్‌కు వేసి గెలిపించాలన్నారు. మంచిర్యాల జిల్లా కార్యదర్శి గడియారం శ్రీహరి, ఉపాధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కేజియా రాణి, భాగ్యలక్ష్మి, శ్రీధర్‌రాజు, శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి సునీత, కర్యా నిర్వాక కార్యదర్శి సత్యనారాయణ, స్పోర్ట్స్ సెక్రెటరీ అనురాగ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు అనుముల సతీశ్, కార్యదర్శి గోపాల్, చెన్నూర్ యూ నిట్ అధ్యక్షుడు పొన్న మల్లయ్య, లక్షెట్టిపేట యూ నిట్ అధ్యక్షుడు నరేందర్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు ప్రభు, కార్యదర్శి పద్మలత, తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...