పదికి పకడ్బందీగా..


Sat,March 16, 2019 01:04 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : నేటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 11,085 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వీరి కోసం 59 కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9-30గంటల నుంచి మధ్యాహ్నం 12-15గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. హిందీ పరీక్ష రోజు మాత్రం 30 నిమిషాలు ఎక్కు వ ఉం టుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎంఏ రషీద్ తెలిపారు. విద్యార్థులు 8-30గంటల వరకే కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. సీఎస్‌లు, డీవోలు 8-30 గంటల వరకే ఆయా సెంటర్ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు చేరుకొని ప్రశ్నపత్రాలు తీసుకొని 9గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని 9-15గంటలకు ప్రశ్నపత్రాలను ఓపెన్‌చేసి 9-30గంటలకు విద్యార్థులకు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్, జవాబు పత్రాలను అందజేయాలని తెలిపారు. 9-30 గంటల తర్వాత ఐదు నిమిషా ల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి పంపిస్తారని ఐదు నిమిషాలకు మిం చి ఆలస్యంగా వస్తే అనుమతి ఉండదని డీఈవో తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సివిల్ డ్రెస్‌లో రావాలని ఎవరు కూడా స్కూల్ యూనిఫామ్స్ వేసుకొని రావద్దని తెలిపారు. ఎలాం టి ఎలక్ట్రానిక్స్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సీఎస్‌లు, డీవోలు, తనిఖీలు చేసే అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది, ఎవరైనా పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు తీసుకురావద్దని డీఈవో తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 59 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు సం బంధించిన ఏర్పాట్లును ఆయా పరీక్ష కేంద్రాల సీఎస్‌లు, డీవోలు పూర్తి చేసుకున్నారు. విద్యార్థులకు డ్యూయ ల్ డెస్క్ బెంచీలు ఏర్పాటు, పరీక్షలు జరిగే గదిలో ఫ్యాన్స్, లైటింగ్ సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సౌకర్యంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయించారు. కేంద్రాలలో వైద్య సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఎస్సెస్సీ పరీక్షల కోసం వివిధ శాఖల సమన్వయం..
ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశాల ప్రకారం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పరీక్షా సమయం లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలా గే విద్యార్థుల కోసం ఆర్టీసీ సేవలందించనుంది. ఈమేరకు కేంద్రాలున్న రూట్లలో ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు డీఎం మల్లికార్జున్‌రెడ్డి తెలిపా రు. వైద్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బందిని నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయిస్తున్నారు. రెవె న్యూ, పంచాయతీ రాజ్ అధికారుల ఆధ్వర్యం లో సిట్టింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాలో మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు..
పరీక్షల పర్యవేక్షణకు గాను జిల్లాలో మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులుంటారు. ఇందులో ఒకరు పీజీ హెచ్‌ఎం, ఒకరు రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్, ఒక ఏఎస్సై ఉంటారు. వీరు కాకుండా జిల్లా విద్యాశాఖధికారి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ దామెదర్, డీసీఈబి కార్యదర్శి భీంరావు, ఆయా పరీక్ష కేంద్రా ల పరిధిలోని తహసీల్దార్లు, సీఐలు, ఎస్సై లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈవోలు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. సిట్టింగ్ స్కాడ్‌లో రెవెన్యూ సిబ్బంది లేదా పంచాయతీరాజ్ సిబ్బంది బాద్యతలు నిర్వహించనున్నారు.

పరీక్ష విధుల్లో..
జిల్లాలోని 59 పరీక్ష కేంద్రాల్లో 59 సీస్‌లు, 59 మంది డీఓలు, ఒకరు అడిషనల్ డీవో, ప్రతి 24మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ విధులు నిర్వహించనున్నారు.

హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయంలో ఎస్సె స్సీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సౌక ర్యం కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు డీఈవో ఎంఏ రషీద్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 9110382012, 9440688155 నెంబర్‌లో సంప్రదించవచ్చనని తెలిపారు.

పది విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం
మంచిర్యాల అగ్రికల్చర్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ బీ రవీందర్, మంచిర్యాల డిపో మేనేజర్ మల్లిఖార్జున్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసే వరకు బస్ పాసులు (ఉచిత లేదా రాయితీ) కలిగి ఉంటే వారి నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రం ఉన్న పట్టణం లేదా గ్రామానికి ఉచితంగా టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నామన్నారు. సదరు పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు బస్సు పాస్‌ను తప్పని సరిగా వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఒకవేళ ఎలాంటి బస్ పాస్ లేని వారు తప్పనిసరిగా టికెట్టు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ అవకా శాన్ని బస్సు పాస్‌లుండి పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...