వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం


Sat,March 16, 2019 01:04 AM

కోటపల్లి : పదో వార్షిక ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి తీరుతామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి సంజీవ రావ్ పేర్కొన్నా రు. కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ కనకదుర్గ, ఏటీడీఓ ధరావత్ నారాయణతో కలిసి సందర్శించారు. శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు హా ల్ టికెట్లతో పాటు పరీక్షలకు సంబంధించిన సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా డీటీడీఓ మా ట్లాడుతూ 16 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 100 శా తం ఉత్తీర్ణత సాధిస్తామని చెప్పారు. పదో తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామనీ, ప్రత్యేక తరగతుల నిర్వహణతోపాటు ప్రతి రోజు ఉదయం, సాయం త్రం స్లిప్ టెస్టులను నిర్వహించి వారి సామర్థ్యాలను అంచనా వేసినట్లు వివరించారు. ఆశ్రమ పాఠశాలలను జిల్లాలోనే నెంబర్ వన్‌లో నిలబెడతామని పేర్కొన్నారు. విద్యార్థులను భోజనం, సౌకర్యాల విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం అందించాలని పాఠశాల మ్యాట్రిన్ సుమలతకు సూచించారు. పాఠశాల హెచ్‌ఎం సురేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...