ముగ్గురి పాత్ర ప్రధానం


Fri,March 15, 2019 01:43 AM

-ఎన్నికల నిర్వహణలో అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలే ముఖ్యం
-బీఎల్‌వోలు నిర్లక్ష్యం చేస్తే సూపర్ వైజర్లదే బాధ్యత
-బీఎల్‌వోలు, సూపర్‌వైజర్ల సమావేశంలో కలెక్టర్ భారతి
మందమర్రి రూరల్ : ఎన్నికల విధుల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. మంద్రమర్రి మోడల్ స్కూల్‌లో గురువారం బీఎల్‌వోలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఆమె మాట్లాడుతూ, చునావ్ పాఠశాలలో బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు ఉపాధ్యాయులని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓట్లు గల్లంతు కాకుండా ఒక కుటుంబంలోని అందరి పేర్లు న మోదై ఉండేలా చూడాలన్నారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఓటు జాబితా గుండెకాయలాంటిదన్నారు. అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ముఖ్య పాత్ర పోషించినప్పుడు ఎన్నికలు విజయవంతంగా పూర్తవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. మండలంలో మొత్తం 88 పోలింగ్ బూత్‌ల జాబితాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. ఏడా ది పాటు ఎన్నికల విధుల్లో ఉండే బీఎల్‌వోలు పూర్తి సమాచారం తెలిసి ఉండడమే గాక ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ స్నేహలత, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.

బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి టౌన్ : ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వో లు నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సూపర్‌వైజర్లే బా ధ్యత వహించాలని కలెక్టర్ హోళికేరి స్పష్టంచేశా రు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కాసిపే ట, తాండూర్, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు చునావ్ పాఠశాల కార్యక్రమంపై గురువారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరం, సింగరేణి కళావేదికల్లో వేర్వేరుగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలు, నియమాలు క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కలెక్టర్ మండిపడ్డారు. ఫలితంగా ఓటరు నమో దు, ఇతర ఎన్నికల అంశాలను అనుకున్న స్థాయి లో అమలుచేయలేకపోతున్నామని ఆమె అసంతృ ప్తి వ్యక్తం చేశారు. బీఎల్‌వోలు బూత్ లెవల్ రిజిష్టర్‌ను నామమాత్రంగా మెయింటేన్ చేస్తున్నార నీ, ఎన్నికలకు గుండె లాంటి ఓటర్ జాబితాలో లోటుపాట్లకు తావులేకుండా రూపొందించాలని సూచించారు. బీఎల్‌వోల పని తీరు సక్రమంగా లేకపోతే సూపర్‌వైజర్లను బాధ్యులను చేసి వెం టనే వారిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నియామావళిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ కల్పించే సౌకర్యాలను ఓటర్లకు వివరించి గర్భిణి, బాలింతలు, వికలాంగులు, వృద్ధులు కేంద్రాలకు వచ్చేలా వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్య త బీఎల్‌వోలపై ఉందని స్పష్టం చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల నిర్వహణపై అవగాహన కల్పించారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రలోభాలు, ఇతర ఎన్నికల నియమావళి వ్యతిరేక చర్యలపై ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన సీ-విజిల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాంకేతిక నైపుణ్యం లేని వారు కలెక్టర్ కార్యాలయంలోని 1950 టోల్‌ఫ్రీం నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఓటర్ నమోదులో ఫాం నెంబర్లపై బీఎల్‌వోలకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వాటిపై కనీస అవగాహన లేకపోవడంతో విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం లోపించిందనీ, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవగాహన సదస్సులో అసిస్టెంట్ కలెక్టర్ స్నేహలత, సబ్ డివిజన్ పరిధిలోని బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...