భీమన్నకు ప్రత్యేక పూజలు


Sat,February 23, 2019 02:03 AM

-మొదలైన గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర
-ఊరేగింపుగా తరలిన గిరిజనులు
-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అధికారులు
రామకృష్ణాపూర్: మాఘశుద్ధ పౌర్ణమిన నాయకపోడ్ వంశస్తుల సంప్రదాయ పూజల మధ్య బొక్కలగుట్ట పంచాయతీలోని గాం ధారిఖిల్లా మైసమ్మ జాతర శుక్రవారం ప్రా రంభమైంది. తొలి రోజు సదర్ల భీమన్న గజాల (కర్ర విగ్రహాలు) వద్ద పూజారులు పూజలు చేసి పవి త్ర జలాల్లో శుద్ధి చేసేందుకు గోదావరి నదికి తీసుకెళ్లారు. జిల్లా ట్రైబల్ డెవలప్‌మెంట్ అధికారి సంజీవయ్య జాతర ఏర్పాట్లను పరిశీలించారు.తొలి రోజు జిల్లా ట్రైబల్ డెవలప్‌మెంట్ అధికారి సంజీవయ్య, ఏటీడబ్ల్యూవో కనకదుర్గ, ఎం పీపీ బొలిశెట్టి కనకయ్య గజాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి 2 కిలో మీ టర్ల దూరాన ఉన్న గాంధారి ఖిల్లాకు కాలినడకన చేరుకొని మైసమ్మను దర్శించుకున్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తాగునీరు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. శనివారం నా యక్‌పోడ్ సంప్రదాయ కళారూపాల ప్రదర్శన, ఆదివారం ప్రజా దర్బా ర్ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి విభా గం అధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రదర్శనలుంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎంపీపీ బొలిశెట్టి కనకయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే, గిర్దావార్ దేవరాజ్, నాయక్‌పోడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సత్యనారాయణ, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి మేశినేని రాజన్న, జిల్లా అధ్యక్షు డు పెద్ది రాజన్న, ఉపాధ్యక్షుడు రాజమల్లు, ఆలయ కమిటీ కార్యదర్శి గంజి రాజన్న, గ్రామస్తులు మారుపాక రాజన్న ఈవోపీఆర్డీ సర్ధార్ అలీ ఉన్నారు.

ఆటపాటలతో గోదావరికి పయనం
బొక్కలగుట్ట పంచాయతీ సమీపంలోని సదర్ల (దారి) భీమన్న, నాయక్‌పోడ్ పూజారులు లౌవుడం మైసయ్య, జైనేని భీమయ్య మైస మ్మ తల్లిని సదర్ల భీమన్న గజాల వద్ద పసు పు, కుంకుమలతో పట్నాలు వేసి పూజలు చేశారు. అనంతరం తప్పెటగూళ్లు దరువు చప్పుళ్లు, పిల్లనగ్రోవుల ఆటపాటలతో ఊరేగింపుగా కాలినడకన భీమన్న దేవుడిని గో దావరి వద్దకు తీసుకెళ్లి శుద్ధి చేసి కార్యక్రమానికి తీసుకొని వెళ్లారు. గోదావరిలో దేవతా మూర్తులను (గజాలను) గంగా జలంతో శుద్ధి చేసి నేవేధ్యం వండి సమర్పించి తిరిగి సాయంత్రానికి బొక్కలగుట్ట సదర్ల భీమన్న వద్దకు చేరుకుంటారు. పూజారులు లౌవు డం మైసయ్య, జైనేని బీమయ్య, సేవా సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర సంస్కృతిక కార్యదర్శి రాజన్న, జిల్లా అధ్యక్షుడు పెద్ది రాజన్న, ఉపాధ్యక్షుడు రాజమల్లు, ఆలయ కమిటీ కార్యదర్శి రాజన్న నాయక్‌పోడ్ సంఘం సభ్యులు వెళ్లారు.

కాసిపేట రూరల్: దేవాపూర్ శివారులోని గజా ల భీమన్న ఆదివాసీలు ప్రత్యేక పూజలు చే శారు. గాంధారి ఖిల్లా జాతరకు వెళ్లే ముం దు బొక్కలగుట్ట దగ్గరిలోని సదర్ భీమన్న దేవుడికి దగ్గరి వెళ్లి పూజలు చేసినట్లు వివరించారు. అక్కడి నుంచి పాదయాత్రగా గో దావరికి తరలివెళ్లి బొక్కలగుట్టలోని సదర్ భీమన్న ఆలయం చేరుకుంటారు. ఆదివాసీ నాయక్‌పోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొ మ్ముల బాపు, జిల్లా ఉపాధ్యాక్షులు రొడ్డ చిన్న రమేశ్, అయ్యగారు రొడ్డ లచ్చులు, ఆదివాసీలు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...