జిల్లాలో ఓటర్లు 5,85,301


Sat,February 23, 2019 02:01 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అధికారులు జాబితా సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ఆ జాబితా విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 5,85,301 ఓటర్లు అని లెక్క తేల్చారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంలకు సం బంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన అధికారులు ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతు అయ్యాయని చాలా మంది ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. 18 ఏండ్లు నిండిన వారు, అసెంబ్లీ ఎన్నికల్లో జాబితాలో పేర్లు లేని వారికి ఎన్నికల సంఘం నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి మరీ ఓట్ల నమోదు చేపట్టారు. జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూ ర్ నియోజకవర్గాల వారీగా అధికారులు ఓటరు జాబితా సిద్ధం చేశారు. కొత్తగా నమోదు చేసుకోవడానికి, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో చాలా మంది ముందుకొచ్చా రు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆయా విభాగాల వారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి.

జిల్లాలో ఓటర్లు 5,85,301
జిల్లాలో మొత్తం ఓటర్లు 5,85,301మంది ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో పురుషులు 87,571 మంది, స్త్రీలు 86,287 మంది, ఇతరులు ఐదుగురు మొ త్తం 1,73,863 మంది ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పురుషులు 82,282 మంది, స్త్రీలు 81,687 మంది, ఇతరులు 14 మంది మొత్తం 1,63,983 మంది ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పురుషులు 1,24,506 మంది, స్త్రీలు 1,22,920 మంది, ఇతరులు 20 మంది ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,47,455 మంది ఉన్నారు. అన్ని చోట్ల స్త్రీల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. జిల్లా ఓటర్లకు సం బంధించి అధికారులు ఎన్నికల సంఘానికి తుది జాబితా అందించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...