ఉత్తమ ఆలోచనలతో ఉజ్వల భవిష్యత్


Sat,February 23, 2019 02:00 AM

- సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలి
- మందమర్రి, బెల్లంపల్లి జీఎంలు రాఘవులు, రవిశంకర్
- సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా వరల్డ్ థింకింగ్ డే వేడుకలు
రెబ్బెన : సమాజంలో ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సింగరేణి పాఠశాలలో శుక్రవారం భారత స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్యుడు లార్డ్ బాడెన్ పావెల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ స్కౌట్ జెండాను ఆవిష్కరించి బడెన్‌పావెల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి, సింగరేణి శాంతి-ప్రగతి యాత్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. భారత స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవడుతాయని, వారందరూ దేశ సేవ చేయడం లో ముందుంటారని పేర్కొన్నారు. చేడు ఆలోచనలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా ఇన్‌చార్జి డీజీఎం(పర్సనల్) బీ సుదర్శనం, డీవైపీఎం ఎల్ రామాశాస్త్రి, హెచ్‌ఎం సంతోశ్, స్కౌట్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ కమిషనర్, పీఈటీ భాస్కర్, ఉపాధ్యాయులు, స్కౌట్ విద్యార్థులు పాల్గొన్నారు.

మందమర్రి రూరల్ : చిన్ననాటి నుంచే మంచి భావాలను అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని, సమాజానికి తమ వంతుగా సేవలు అందించాలని ఏరియా జీఎం రాఘవులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించిన స్కౌట్ ఆండ్ గైడ్స్ వ్యవసాపకుడు లార్డ్ బాడెన్‌పావెల్ జయంతి సందర్భంగా వరల్డ్ థింకింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఎం రాఘవులు పాల్గొని మాట్లాడారు. సమంచి పౌరులుగా ఎదిగి గురువులకు తల్లిదండ్రులకు పేరు తేవాలని పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన స్కౌట్ పతాకాన్ని ఆవిష్కరించారు. లార్డ్ బాడెన్ పావెల్ చిత్ర పటానికి ఆయన పూలమాల వేశారు. సర్వ మత ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా డీజీఎం పర్సనల్ మురళీధర్‌రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. వెంకటేశ్వర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...