మత్య్సకారులకు మరో వరం


Fri,February 22, 2019 12:31 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కారు కులవృత్తులకు జీవం పోస్తున్నది. వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. సబ్సిడీ అందజేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇం దులో భాగంగానే నీలివిప్లవం కింద మత్య్సకారుల కు ఉచితంగా చేపపిల్లలు అందజేసి చెరువుల్లో వదులుతున్నది. మూడేళ్లుగా జిల్లాలో అమలవుతుండగా ఏటా కోట్ల సంపద అందుతుంది. వారు ఆర్థికంగా ఎంతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు ప్రభు త్వం మరో అడుగు వేసింది. అర్హులైన వారు, ఆసక్తి కలిగిన వారికి 40 నుంచి 75 శాతం సబ్సిడీతో చేపల చెరువులను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టింది. హెక్టారుకు రూ.8.50 లక్షలు ఇచ్చేందు కు ప్రణాళికలు రూపొందించింది. గరిష్టంగా ఒక్కొక్కరికి రెండు హెక్టార్ల వరకు సబ్సిడీ అందజేయనున్న నేపథ్యంలో జిల్లా మత్య్సశాఖ లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నది. దీనికి సంబంధించి అధికారులకు నిబంధనలు జారీ అయ్యాయి.

రెండు పథకాలతో అందరికీ మేలు..
- ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి చెరువుల్లో చేప పిల్లలను పోసి మత్య్ససంపదను పెంచి మత్య్సకారులకు ఉపాధి చూపిన తెలంగాణ సర్కా ర్ ఇక నుంచి ఆసక్తి కలిగిన, అర్హులైన వారికి కృత్రి మ చెరువులకు నిధులు మంజూరు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో మత్స్యసంపద పెంచి చేపల కొరత లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నది. సమగ్ర మత్స్య శాఖ అభివృద్ధి పథకం(ఐఎఫ్‌డీఎస్) కింద 17 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి యూనిట్ కాస్ట్ రూ.8.50 లక్షలుగా నిర్ణయించారు. సబ్సిడీ 75 శాతం కాగా, రూ. 6,37,500 మాఫీ కానున్నా యి. అందులో లబ్ధిదారులు కట్టాల్సింది కేవ లం 25 శాతం మాత్రమే అంటే రూ. 2,12,500. అయితే, ఇది కేవలం మత్స్య కార్మికులకు మాత్ర మే. ఇక నీలి విప్లవం కింద చేపల చెరువులు తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. దీని కింద ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఇప్పటికి నీలి విప్లవం కింద 39 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి యూని ట్ కాస్ట్ రూ. 8 లక్షలుగా నిర్ణయించారు. దీనికి సం బంధించి 40 శాతం సబ్సిడీ అంటే రూ.3.20 లక్ష లు ఇవ్వనున్నారు. మిగతా అరవై శాతం అంటే రూ.4.80 లక్షలు కట్టాలి. ఎన్ని హెక్టారుల్లో చెరువులు తవ్వుకున్నప్పటికీ గరిష్టంగా రెండు హెక్టార్లకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తున్నది.

ఒక్కో యూనిట్‌కు రూ.8.50 లక్షలు..
- చేపల చెరువులను నిర్మించుకుని వాటిలో చేపలను పెంచి మత్య్స సంపద ద్వారా మత్య్సకారులకు అధిక ఆదాయం అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చేపల చెరువుల నిర్మాణంపై దృష్టిసారించింది. అర్హులైన వారికి ఒక్కో యూనిట్‌కు రూ.8.50 లక్షలు కేటాయించనుంది. అందులో రూ.7లక్షలు చెరువు తవ్వడానికి వినియోగించనుండగా, రూ.1.50 లక్షలు చేపపిల్లలు, వాటి ఆహారం కోసం వినియోగిస్తారు. రైతులు ఎన్ని హెక్టార్లలో చెరువులు తీసినప్పటికీ గరిష్టంగా ఒకరికి రెండు హెక్టార్ల వరకు సబ్సిడీ అందుతుంది. మొత్తం యూనిట్ కాస్ట్ రూ.8.50లక్షల్లో సొసైటీ సభ్యులైతే 75శాతం సబ్సిడీ పోను రూ.2.12లక్షలు, నాన్‌సొసైటీ సభ్యులు మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 60శాతం సబ్సిడీ పోను రూ. 3.40లక్షలు, ఇతరులకు 40 శా తం సబ్సిడీ పోను రూ.5.10లక్షలు మత్స్యశాఖ ఎఫ్‌డీఓ పేరుతో డీడీ తీసీ అందజేయాలి. చేపల చెరువులు కావాలనుకునే వారు మొదట మత్స్యశాఖ అధికారులను సంప్రదించి రూ.200 ఫీజు చెల్లించి తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగా దరఖాస్తులు తీసుకుని ఆసక్తి, అర్హతను పరిశీలించి యూనిట్‌ను జిల్లా స్థా యి కమిటీ ఆధ్వర్యంలో కేటాయిస్తారు. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా జిల్లా మత్స్యశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా వ్యవసాయ శాఖ, నీటిపారుదల, భూగర్భజల వనరుల శాఖ అధికారులు ఉంటారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...