రైతుబజార్‌లో కూరగాయల విక్రయానికి ఏర్పాట్లు


Sat,February 16, 2019 02:17 AM

- జేసీ వై సురేందర్ రావు
మంచిర్యాల రూరల్ : రైతుబజార్‌లో కూరగాయలు,పండ్లు అమ్ముకునేందుకు రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ వై సురేందర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం వ్యవసాయ అధికారులు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్‌తో కలసి వ్యా పారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు పక్కన కూరగాయలు,పండ్లు అమ్ముకునే వారికి రైతు బజార్‌లో అవకాశం కల్పించి, వారిని తక్షణమే తరలించాలన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ సీఐల ఆధ్వర్వంలో వారిని గుర్తించి రైతు బజార్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఆటంకం కలుగకుండా కూరగాయలు,పండ్లు అమ్ముకునే వారిని గ్రూప్‌లో రిజిస్టర్ చేయాలని సూచించారు. ప్రతి శనివారం మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్వహించే వార సంతను ఈ నెల 23న శనివారం నుంచి రైతు బజార్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పట్టణ ట్రాఫిక్ సీఐ రమేశ్ బాబు, కమిషనర్ శ్రీకాంత్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి వెంకటేశ్, ఉద్యానవన శాఖ అధికారులు తిరుపతి, సుప్రజ, సహజ, వ్యాపారులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...