వ్యాక్సిన్ల వివరాలు నమోదు చేయాలి


Sat,February 16, 2019 02:17 AM

- జిల్లా వైద్యాధికారి భీష్మ
మంచిర్యాల అగ్రికల్చర్ : ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు చిన్న పిల్లలకు వేసే టీకాలు, వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందు పర్చాలని జిల్లా వైద్యాధికారి భీష్మ సూచించారు. పట్టణంలోని ఐఎంఏ హాలులో యూఎన్‌డీపీ ఆధ్వర్యంలో ఫార్మాసిస్టులకు, స్టాఫ్ నర్సులకు ఎలక్ట్రానిక్ వ్యాక్సి న్ ఇండలిజెన్సీ నెట్‌వర్క్(ఈవీఐఎన్)లపై ఏర్పాటు చేసిన శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. డాటాను మొబైల్‌లో సరైన సమయంలో అప్‌లోడ్ చేయాలన్నారు. ఏకీకృత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఫార్మాసిస్టులకు, స్టాఫ్ నర్సులకు టీకాల వివరాలను ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేయాలో శిక్షణ ఇవ్వడంతో పాటు యునైటెడ్ నేషనల్ డెవలఫ్‌మెంటు ప్రోగ్రాం(యూఎన్‌డీపీ) వారు ఈవీఐఎన్ యాప్ కలిగిన మొబైల్ ఫోన్లు అందించడం అభినందనీయమన్నారు. టీకాను నిల్వ చేసి ఉంచిన సమయంలో కరెంటు పోతే ఆ విషయం జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమాచారం ఎస్‌ఎంఎస్ రూపంలో, మెయిల్ రూపంలో చేరుతుందన్నారు. దీంతో అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ పొందిన వారందరికీ సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్లు అందించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్(డీఐఓ) డాక్టర్ సత్యనారాయణ, యూఎన్‌డీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మనీష్ కుమార్, హెచ్‌ఈఓ గుండేటి నాందేవ్, అఖ్విల్ జియా, సిబ్బంది, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...