పల్లెల్లోనే పెండ్లి నమోదు


Fri,February 15, 2019 12:09 AM

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) సమాజంలో అన్ని కులాలు, మతాలు, వర్గాలు జరుపుకునే వివాహాలకు 2002 నుంచి చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి పెండ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి సంబంధించి ప్రచారం లేకపోవడం, అవగాహన లోపంతో చాలా పెండ్లిండ్లు రిజిస్ట్రేషన్ కావ డం లేదు. ఈ కారణంగా బాల్య వివాహాలు, మోసపూరిత వివాహాలు, రెండో వివాహాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వాటిని నివారించేందుకు ప్రత్యే క చర్యలు చేపట్టింది. గ్రామాల్లో జరిగే ప్రతి వివాహాన్ని నమోదు చేసే బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. మంచిర్యాల జిల్లా లో ఏటా నాలుగు వేల పెండ్లిండ్లు జరుగుతుంటా యి. వీటిల్లో దాదాపు 90 శాతం వరకు నమోదు కావడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి రావడమే దానికి కారణం. దీంతో చాలా వరకు కావడం లేదని ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇక నుంచి ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాల కోసం పెండ్లి జరిగిన తర్వాత ఓ కాగితంపై ధ్రువ పత్రాలను జారీ చేస్తున్నారు. ఇక నుంచి రాష్ట్రమంతా ఒకే విధంగా వివాహాల నమోదు జరిగేలా వివాహ మోమెరాండం, రిజిస్టర్, ధ్రువ పత్రాలు ఇవ్వనున్నారు.

జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..
ఏటా జిల్లాలో నాలుగు నుంచి ఐదు వేల వరకు పెండ్లిండ్లు జరుగుతుంటాయి. అయినా నమోదు చేసుకునే వారి సంఖ్య పదుల్లోనే ఉంటోంది. అవగాహన లేమి, నిరక్షరాస్యత కారణంగా వందల సంఖ్యలో బాల్య వివాహాలు జరగుతున్నాయి. ము హూర్తాలు ఉన్న సమయంలో వీటి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఐసీడీఎస్ అధికారులు ఆపేసిన వివాహాలే ఇందుకు నిదర్శనం. జిల్లా స్థాయిలో కలెక్టర్, మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి వివాహాల నమోదు అధికారిగా ఉంటారు. జిల్లా సంక్షేమాధికారి (ఐసీడీఎస్ జిల్లా అధికారి) అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెండ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
ఈ విధానంతో వంద శాతం బాల్య వివాహాలు అడ్డుకునే అవకాశం కలుగుతుంది. వివాహం జరిపే వధువు, వరుడు తరఫు వాళ్లు పంచాయతీ కార్యదర్శికి నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి. ఆడపిల్లలకు 18 ఏండ్లు నిండి, పురుషులకు 21 ఏండ్లు నిండిన వారు నమోదు చేసుకుంటారు. ఆధార్ కా ర్డులు, శుభలేఖ, వివాహ ఫొటోలు, ముగ్గురు సాక్షు ల సంతకాలు తీసుకుని పంచాయతీ కార్యదర్శి వివాహ నమోదు పత్రాన్ని అందచేస్తారు. కార్యదర్శి సంతకంతో వివాహ నమోదు పత్రాన్ని ఇస్తారు. ఇది అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా వివాహ నమోదు చేసుకోవచ్చు. మున్సిపాలిటీల్లో కమిషనర్ వివాహ నమోదు అధికారిగా వ్యవహరిస్తారు.

కల్యాణలక్ష్మి మరింత సులువు..
నిరుపేద కుటుంబాల ఆడపిల్లలకు వివాహాలు జరిగితే తల్లి ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ. 1,00,116 జమ చేస్తున్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి వివాహం నమోదు చేసి ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇందులో కూడా సామాన్యులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని గమనించిన ప్రభుత్వం అన్ని రకాలుగా అనువుగా ఉండేందుకు కార్యదర్శులకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట గ్రామాల్లోనే పంచాయతీ కార్యదర్శులు నిర్ణీత నమూనాలో దరఖాస్తులు తీసుకుని వివాహాలు నమోదు చేయనున్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...