ఆడంబరంగా అనాథ పెండ్లి


Fri,February 15, 2019 12:07 AM

భీమారం: ఓ అనాథ పెళ్లికి అందరూ పెద్దలై అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పదమూడేళ్ల వయస్సులో తల్లిదం డ్రుల ను కోల్పోయిన ఆ యువతికి ఆశ్రయ మి వ్వడ మే గాక మంచి వరుడిని చూసి అతడి చేతిలో పెట్టారు.

భీమారం మండలం పొలంపల్లి అనాథాశ్రమం (వర్డ్స్ ఓవర్ ఆఫ్ ఇండియా)లో సునీత వివాహం-ప్రభాకర్‌తో గురువారం నిర్వహించారు. కల్యాణానికి ముఖ్య అతిథులుగా ఢిల్లీలో తెలంగాణ ప్రభు త్వ సలహాదారు రామచంద్ర తేజవత్, బెల్లంప ల్లి ఎమ్మెలే దుర్గం చిన్నయ్య దంపతులు, వర్డ్స్ సోవర్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు షారోన్ నైటింగేల్(ఆమెరికా), ఎస్టీ ఎంప్లాయీ స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతుల్ నా యక్, జైపూర్ థర్మల్ పవర్‌ప్లాంట్ జీఎం రాజేశ్ కొత్త జంటను ఆశీర్వదించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన సునీత పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోగా ఇద్దరు అక్కలు, ఒక అన్న ఉన్నారు. గ్రామానికి చెందిన కొందరు ఆమెను పోలం పల్లిలోని అనాథాశ్రమంలో చేర్పించారు. అక్క డే ఉంటూ ఆమె జీఎన్‌ఎం నర్సింగ్ కోర్సు పూర్తి చేసి, ప్రస్తుతం మంచిర్యాలలోని ఒక ప్రయివేట్ దవాఖానలో పనిచేస్తోంది. ఆశ్రమ డైరెక్టర్ కాంతారావు ఆమెకు నిజామాబాద్ జిల్లా దుపల్లికి చెందిన ప్రభాకర్(బీటెక్-ఎలక్ట్రానిక్స్)తో వివాహం చేయాలని నిశ్చయించారు. కులం, మతం, కట్న కానుకులు అవసరం లేదని అతడు చెప్పడంతో గురువారం వైభవంగా పెళ్లి చేశారు. వీరి వివాహ వేడుకకు సుమారు 2వేల మంది తరలివచ్చారు. ఆశ్రమం ప్రారంభ మైనప్పటి నుంచి ఇదే మొదటి పెళ్లి కావడం తో వ్యవస్థాపకురాలు షారోన్ నైటింగేల్ అమెరికా నుంచి వచ్చారు. నా పెద్ద కూతురు వివాహానికి హాజరైనందుకు సంతోషంగా ఉన్నానంటూ ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ట్రస్ట్‌లో ఇంత గొప్పగా వివాహ వేడుక జరగడం చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఎక్కడైనా అనాథలుంటే ఆశ్రమానికి తీసుకురావాలని నిర్వాహకులు కాంతారావు కోరారు. అంతకుముందు బాంబ్ స్కా డ్ బృందాలు అక్కడి అటవీ ప్రాంతంతో పాటు ఆశ్రమంలో భోజనాలను పరిశీలించా రు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ సీఐ నారాయ ణనాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు చేశారు

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...