పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి


Fri,February 15, 2019 12:07 AM

మంచిర్యాల రూరల్: పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేసీ సురేందర్ రావు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో పదో తరగతి పరీక్షల నిర్వాహణ ఏర్పాట్లపై గురువారం సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మార్చి 16 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో 54 కేంద్రాలు, ప్రయివేట్ విద్యార్థుల కోసం 5 కేంద్రాలతో మొ త్తంగా 59 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 6 వేల 980 మంది, ప్రయివేట్ నుంచి 4వేల 105 మంది పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఈ మేరకు ప్ల యింగ్ స్కాడ్, రూట్ అధికారులను నియమించినట్లు స్పష్టం చేశారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తాగునీరు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలనీ, అత్యవసర సేవలను అందించేందుకు వైద్య శాఖ ఆధ్వర్వంలో పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఉపవైద్యాధికారిని ఆదేశించారు. రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్‌ను గ్రామీణ ప్రాంతా ల్లో పరీక్షా సమయానికి అనుగుణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పురపాలక సం ఘం పరిధిలో ఉన్న అన్ని పరీక్షా కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలని సూచించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల వారీగా ప్రశ్నాపత్రాలను భద్రపరచాలన్నారు. దానికనుగుణంగా రూట్ అధికారులు పరీక్షా కేం ద్రాలు, ప్రశ్నాపత్రాలు తరలించేందుకు తగిన బం దోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉండేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా రవాణాశాఖ అధికారి లెక్కల కిష్టయ్య, జిల్లా విద్యాధికారి రషీద్, జిల్లా ఖజానా అధికారి సరోజ, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...