పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు


Thu,February 14, 2019 02:04 AM

-సీఈఓ రజత్‌కుమార్
మంచిర్యాల రూరల్ : త్వరలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈఓ రజత్‌కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు డీఈఓ, ఆర్‌ఓలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల మానిటరింగ్‌పై వీరికి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇస్తారని చెప్పారు. వీరితో పాటు నోడల్ అధికారి కూడా ఉంటారని తెలిపారు. శిక్షణ అనంతరం ఆర్‌ఓలకు పరీక్ష ఉంటుందని చెప్పారు. అనుత్తీర్ణులైన వారికి ఈ నెల 20న ఢిల్లీలో పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరాను కలసి అన్ని అంశాలపై చర్చించినట్లు వివరించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...