ఇంధన పొదుపు అందరి బాధ్యత


Thu,February 14, 2019 02:03 AM

-తహసీల్దార్ నాగరాజు, భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధి రాహూల్
-విద్యార్థులతో అవగాహన ర్యాలీ, ఐబీ కేంద్రంలో ప్రతిజ్ఙ
తాండూర్ : ఇంధన పొదుపు అందరి బాధ్యత అనీ, లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తహసీల్దార్ నాగరాజు, భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధి రాహూల్ పేర్కొన్నారు. ఇందన పొదుపు మాసోత్సవాల్లో భాగంగా బుధవారం తాండూర్‌లో అవగాహన నిర్వహించారు. స్థానిక సురభి పెట్రోల్ పంప్ వారి సౌజన్యంతో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఐబీ చౌరస్తా దాకా విద్యార్థులు ఫ్లకార్డులతో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ నాగరాజు, భారత్ పెట్రోలియం ప్రతినిధి రాహూల్ హాజరయ్యారు. ఇంధన వనరులను పొదుపు చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్థానిక సురభి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇంధనాన్ని అతిగా వాడడంవల్ల మొక్కలు, జంతువులు, ఇతర సహజ వనరులన్నీ దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీఐ ఉపేందర్, ఎంఈఓ ప్రభాకర్, ఎస్‌ఐ రవి, విద్యా భారతి విద్యాసంస్థ డైరెక్టర్ సురభి శరత్‌కుమార్, సురభి పెట్రోల్ పంపు యాజమాన్యం, సిబ్బంది, విద్యాబారతి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
అడవులను రక్షిద్దాం..
దండేపల్లి : అందరం అడవులను రక్షిద్దామని అటవీ అధికారులు పిలుపునిచ్చారు. దండేపల్లి మండలం బెహ్రూన్‌గూడలో వన్యప్రాణులు, అటవీ సంరక్షణ, ఇతర అంశాలపై గిరిజనులకు కళాకారులు ఆటపాటల ద్వారా అవగాహన కల్పింంచారు. అడవుల సంరక్షణకు స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని అధికారులు అన్నారు. విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను హతమార్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అడవిలోకి వెళ్లమబోమని గిరిజనులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఓ కృష్ణారావు, బేస్ క్యాంప్ సిబ్బంది, తదితరులున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...