టీఆర్ హవా


Tue,January 22, 2019 01:46 AM

-మొదటి విడత ఎన్నికల్లో కారు మద్దతుదారుల జోరు
-దరిదాపుల్లో లేని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు
-ఇతరుల చూపు గులాబీ పార్టీ వైపు..
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మొదటి విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ హవా కొనసాగింది. అనుకున్న విధంగానే జనం టీఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపారు. కొన్ని చోట్ల స్వతంత్రులు గెలుపొందిన వారు కూడా తెలం గాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 109 గ్రామ పంచాయతీలకు సోమ వారం ఎన్నికలు జరిగాయి. అంతకుముందు 8 ఏకగ్రీ వం కాగా అవన్నీ టీఆర్ పార్టీవే కావడం గమనార్హం. సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్ పార్టీ ఏకంగా 62 స్థానాలు కైవసం చేసుకుంది. మిగతా వాటిల్లో 33 మంది స్వతంత్రులు, ఇద్దరు కూటమి అభ్యర్థులు, నలుగురు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు గెలుపొందారు. స్వతంత్రులు కూడా చాలా మంది టీఆర్ పార్టీలో మద్దతు లేకపోవడంతో పోటీ చేసిన వారే. వీరు కూడా టీఆర్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. వీరంతా టీఆర్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరంతా టీఆర్ చేరనున్నారు.
దరిదాపుల్లో లేని పార్టీలు
టీఆర్ పార్టీ అప్రతిహత విజయంతో ముందుకు సాగుతుండగా మిగతా పార్టీలు కనీసం దరిదాపుల్లో లేకుండా పోయాయి. టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చాలా చోట్ల అభ్యర్థులే కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు నలుగురు గెలుపొందగా పలు పార్టీలతో కూడిన కూటమి అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. ఆయా పార్టీలకు చెందిన మద్దతు దారులకు చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...