సింగరేణిలో ఉద్యోగం గొప్ప అనుభూతి


Tue,January 22, 2019 01:44 AM

-అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
-ఆర్జీ-2 జీఎం డబ్ల్యూ. విజయబాబు
యైటింక్లయిన్ కాలనీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి పెద్ద పరిశ్రమ సింగరేణిలో తనకు ఉద్యోగం లభించడం గొప్ప వరమనీ, తనకు గొప్ప అనుభూతిని కలిగించిందని ఆర్జీ-2 డబ్ల్యూ. విజయబాబు పేర్కొన్నారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్లకు పైగా సింగరేణిలో వివిధ హోదాల్లో పని చేస్తూ జీఎంగా విరమణ పొందడం సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. తాను ఆర్జీ-2 ఏరియాలో పని చేసిన కాలం అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాలు ఇచ్చిన చేయూత మరువలేనిదని గుర్తు చేశారు. అంకిత భావంతో పని చేసిన ప్రతి ఉద్యోగికి ఎప్పు డో ఒకసారి తగిన గుర్తింపు లభిస్తుందని సూచించారు. ఆర్జీ-2 ఏరియాకు మంచి పేరు ఉందని ప్రధానంగా ఓసీ పీ-3 ప్రాజెక్టు లక్ష్య సాధనంలో ముందు ఉండడంతోపాటు అనే రికార్డులను సాధించి ఉత్తమ ప్రాజెక్టుగా గుర్తింపు సాధించిందని తెలిపారు. ఆర్జీ-2 ఏరియాలో జనవరిలో 4, 22,720లక్షల టన్నులకుగాను 4,56, 723లక్షల టన్నులు సాధించి 108శాతం సాధించిందని వెల్లడించారు. ప్రధానంగా వకీలుపల్లి గనిలో చిన్నపాటి కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని ప్రవేశపెట్టనున్నామని ఇది విజయవంతం అయితే ఆ గనికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వివరించారు. సమావేశంలో ఎస్ జీఎం కె.రవీందర్, అధికారులు బండి వెంకటయ్య, దుర్గాప్రసాద్, రాజేంద్రప్రసాద్, రామకృష్ణ, పద్మారావు, మురళీకృష్ణ, జానకిరామారావు, తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...