పోలింగ్ ప్రశాంతం


Tue,January 22, 2019 01:44 AM

-ముగిసిన మొదటి విడత
-గరిష్టంగా వేమనపల్లిలో 92.26 శాతం నమోదు
-కేంద్రాలను పరిశీలించిన అధికారులు
బెల్లంపల్లి రూరల్: నియోజకవర్గ వ్యాప్తం గా ఏడు మండలాల్లో సర్పంచ్, వార్డు స భ్యుల పోలింగ్, కౌంటింగ్ సోమవారం ప్ర శాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల కు ప్రారంభమైన పోలింగ్ ఒంటి గంట వర కు కొనసాగగా, 2 గంటల నుంచి కౌంటిం గ్ కొనసాగింది. బెల్లంపల్లి మండలంలో మొత్తం 17 జీపీల్లో ఒకటి ఏకగ్రీవం కాగా 16 స్థానాల్లో కొనసాగింది. 88.5 శాతం న మోదైనట్లు ఎన్నికల అధికారి ఆకుల వెంకటేశ్ తెలిపారు. తాళ్లగురిజాల ఎస్ చిలుముల కిరణ్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ బందోబస్తు నిర్వహించా రు. సోమగూడెం కేంద్రాన్ని కలెక్టర్ భారతి హోళికేరి, మాలగురిజాల కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు ఎల్ శర్మన్ పరిశీలించారు.
కాసిపేట రూరల్: మండలంలో 22 గ్రా మ పంచాయతీలకు చిన్నధర్మారం సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవమవగా వార్డులకు, ధర్మారావుపేట రిజర్వేషన్ విషయంలో గ్రామస్తులు సర్పంచ్, వార్డు సభ్యులకు ఎటువంటి నా మినేషన్ వేయలేదు. దీంతో 20 జీపీల్లో పో లింగ్ కొనసాగగా, చిన్నధర్మారంలో వార్డుల సభ్యుల ఎంపికకు పోలింగ్ జరిగింది. మం డలంలో 20607 ఓటర్లకు 16578 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. మొత్తంగా 80.45 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవాపూర్, ముత్యంపల్లి పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ స్నేహలత, ఎంపీడీవో ఎంఏ అలీం, తదితర అధికారులు పాల్గొన్నారు.

నెన్నెల: మండలంలోని 19 గ్రామ పం చాయతీలు, 137 వార్డులకు పోలింగ్ జరి గింది. మొత్తం 17156 మంది ఓటర్లకు 15675 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 91.2 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండలంలోని జం డావెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని 6వ వార్డులో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దం పతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు పకడ్బందీగా జరగాడానికి అటవీ గ్రామాల్లో ఎస్ శ్రీనివాస్ నేతృత్వం లో భారీగా సీఆర్పీ ఎఫ్ బలగాలను మోహరించారు. మూడు జోన్లు ఆరు రూట్లను ఏర్పాటు చేశారు.
తాండూర్: మండలలోని 14 గ్రామ పం చాయతీల్లో 123 కేంద్రాల్లో 82.92 శాతం పోలింగ్ నమోదైంది. కలెక్టర్ భారతి హోళికే రి బోయపల్లి, కిష్టంపేట, తాండూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్(లా అండ్ ఆర్డర్) తాండూర్, భీమిని మండలా ల ఇన్ వ్యవహరిస్తూ మండల కేం ద్రంలో ఉంటూ అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు చోటు చేసుకోకుండా అప్రమత్తం చే శారు. సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో ఎస్ రవి, రాములు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశా రు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు చ ర్యలు తీసుకున్నారు.
వేమనపల్లి: మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. మొత్తం 11862 ఓట్లకు 11062 ఓ ట్లు పోలవగా, 93.26 శాతంగా నమోదైన ట్లు ఎన్నికల అధికారి రమేశ్ చంద్ర కులక ర్ణి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన లు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కోటపల్లి సీఐ జగదీశ్, నీల్వాయి ఎస్ భూమేశ్ బందోబస్తు నిర్వహించారు.

భీమిని(కన్నెపల్లి): భీమిని, కన్నెపల్లి మం డలాల్లో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. భీమిని మండలంలో మొత్తం 8630 ఓట్లకు 7832 ఓట్లతో 90.75 శాతం నమోదైంది. కాసిపేట 20614 ఓట్లకు 18187 ఓట్లతో 80.45 శాతంగా నమోదైం ది. రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సురేందర్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రా హుల్ రాజ్ భీమిని, కన్నెపల్లి మండలాల్లోని పోలిం గ్ కేంద్రాలను పరిశీలించారు. లింగంపల్లి సునీత సర్పంచ్ అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పత్రంపై లేకపోవడంతో గంట పాటు పోలిం గ్ ఆలస్యంగా జరిగింది. భీమిని, కన్నెపల్లి త హసీల్దార్లు లక్ష్మి, మాధవి, ఎంపీడీవో శంక ర్, అధికారులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...