ప్రతి ఒక్కరూ సహకరించాలి


Mon,January 21, 2019 01:21 AM

కోటపల్లి : శాంతియుతంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పిలుపునిచ్చారు. కోటపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలనీ, ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షలు, వార్డు సభ్యులు రూ.30వేల లోపు ఖర్చు చేయాలని సూచించారు. డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు విస్తృతంగా పోలీసుల తనిఖీలు చేపట్టాలన్నారు. రూ.10వేలకు పైన డబ్బులు తీసుకువెళ్లే వారు తగిన ఆధారాలతో తీసుకువెళ్ళాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలనీ, ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడితే తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ బానోత్ వెంకన్న, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీఓ సత్యనారాయణ, డీటి కమల్ సింగ్, ఆర్‌ఐ డిలేష్, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. కోటపల్లి పోలింగ్ బూత్‌లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా ఓటరు నమోదుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలు సుకున్నారు. 2018 డిసెంబర్ 31 వరకు 18ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించాలనీ, ఈనెల 25 వరకు కొనసాగే ప్రత్యేక ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీఓ సత్యనారాయణ, డీటీ కమల్ సింగ్, ఆర్‌ఐ డిలేష్, వీఆర్వో ప్రవీణ్, బీఎల్వోలు మహేశ్వరి, రాజమణి పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...