గిరిజన పంచాయతీల్లో ఎన్నికళ


Mon,January 21, 2019 01:20 AM

దండేపల్లి : కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తండాల్లో తొలి స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. మావనాటే మావరాజ్..మా గూడాల్లో మా పాలన అంటూ గిరిజనులు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తండాలకు మహర్దశ రాబోతున్నది. పంచాయతీ ఎన్నికలు షురూ కావడంతో స్వపరిపాలన దిశగా అడుగులు వేయబోతున్నాయి. దండేపల్లి మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలున్నాయి. కొత్తగా ఏర్పడిన 10 పంచాయతీల్లో రాజుగూడ, వందుర్‌గూడ, కర్ణపేట, తానిమడుగు తండా లు తొలి సారి ఎన్నికలు జరుగుతున్నాయి. గిరిజన తండాలు ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. సమీప గ్రామాలకు అనుబంధంగా ఉన్న తండా లు ప్రస్తుతం ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పడడంతో స్వపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాయి. దండేపల్లి మండలంలో 100 శాతం ఎస్టీ ఉన్న రాజుగూడ, కర్ణపేట, వందుర్‌గూడ, తానిమడుగు తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేశారు.

స్వపరిపాలన వైపు అడుగులు..
గతంతో నాలుగైదు తండాలను కలిపి సమీప గ్రామ పంచాయతీలకు అనుబంధంగా ఉంచేవారు. గ్రామా లు అభివృద్ధి చెందినా, చిన్న చిన్న తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయేవి. మారుమూల తండాల్లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ 500 జనాభా కలిగిన ప్రతి తండాను జీపీగా మార్చడంతో గ్రామపంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులన్నీ తండాకే వస్తాయి. దీంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చని గిరిజనులు సంబురపడుతున్నారు.

సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు పోటా పోటీ
తండాలకు మొదటిసారిగా ఎన్నికలు జరగుతుండడంతో సర్పంచ్ పదవి కోసం ఆశావాహుల సంఖ్య పెరిగింది. గూడానికి మొదటి సర్పంచ్ కావాలనే కుతుహలంతో పోటీ తీవ్రత ఎక్కువ ఉంది. కొందరు ఏకగ్రీవానికి మొగ్గుచూపుతున్నా మరికొందరు పోటీకే సై అంటున్నారు. కొత్తగా ఏర్పడిన 10 పంచాయతీల్లో వందుర్‌గూడ ఎన్నికలకు దూరంగా ఉంది. తానిమడుగులో సర్పంచ్, 8 వార్డు సభ్యులకు ఒక్కొక్కరే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవమయ్యే అవకాశం ఉన్నది. రాజుగూడలో సర్పంచ్ స్థానానికి ఐదుగురు పోటీపడుతున్నారు. 8 వార్డులకు 24 మంది బరిలో ఉన్నారు. కర్ణపేటలో సర్పంచ్ స్థానానికి ఇద్దరు పోటీపడుతుండగా 8 వార్డులకు 15 మంది బరిలో ఉన్నారు.తండాలను పంచాయతీలుగా చేసినందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...