ఏకగ్రీవ పంచాయతీలో విచిత్రం


Sun,January 20, 2019 02:06 AM

-సంకారంలో నాలుగో వార్డుకుదాఖలు కాని నామినేషన్లు
చెన్నూర్, నమస్తే తెలంగాణ: చెన్నూర్ మండలంలోని సంకారం పంచాయతీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పాటుగా వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాని ఈ పంచాయతీలోని 4వ వార్డు స్థానానికి ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. దీంతో ఆ పంచాయతీలో ఆ ఒక్క వార్డు ఖాళీగా ఉంది. ఈ సంఘటన అధికారులను సైతం ఆశ్చర్యానికి గురు చేస్తోంది. మండలంలోని కన్నెపల్లి, సంకారం గ్రామాలను నూతనంగా సంకారం పంచాయతీని ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో సర్పంచ్ పాటు 8వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్ పదవికి ఆరుగురు అభ్యర్థులు, 1వ వార్డుకు ఒక్కరు, 2వ వార్డుకు ఒక్కరు, 3వ వార్డుకు ఒక్కరు, 5వ వార్డుకు ఒక్కరు, 6వ వార్డుకు ఇద్దరు, 7వ వార్డుకు ఇద్దరు, 8వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను వేయగా, 4వ వార్డుకు మాత్రం ఎవరు నామినేషన్ వేయలేదు. 4వ వార్డు ఎస్టీ (జనరల్) అభ్యర్థులకు కేటాయించగా, ఆ గ్రామంలో అత్యధిక సంఖ్యలో ఎస్టీలు ఉన్నప్పటికీ నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నామినేషన్ ఉప సంహరణ రోజున సర్పంచ్ పదవి పోటీ నుంచి ఐదుగురు అభ్యర్థులు తప్పుకోవడంతో సెడంక పున్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 6, 7, 8 వార్డుల్లో ఇద్దరు చొప్పున పోటీలో ఉండగా, అందులో నుంచి ఒక్కొక్కరు తమ నామినేషన్ విత్ డ్రా చేసుకు న్నారు. 1, 2, 3, 5 వార్డులతో పాటు ఇవి కూడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో సంకారం పంచాయతీ మొత్తం ఏకగ్రీవం కాగ, ఒక వార్డు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎన్నికలు జరుగక పోగా, ఖాళీగా ఉన్న ఈ ఒక్క వార్డుకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ మల్లేశం తెలిపారు. ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు అభివృద్ధి కోసం రూ. 10 లక్షల నజరాన ప్రకటించింది. ఇక్కడ ఒక వార్డు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం అందజేసే నజరానకు తమ గ్రామ పంచాయతీని పరిగణలోని తీసుకుంటారా? లేదా? అనే మీమాంసలో గ్రామస్తులు ఉన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...