చివరి రోజు వెల్లువెత్తిన నామినేషన్లు


Sat,January 19, 2019 01:47 AM

-కేంద్రాల వద్ద రాత్రి వరకూ బారులు తీరిన అభ్యర్థులు
-గ్రామాల్లో పోటాపోటీగా ర్యాలీలు
మంచిర్యాల రూరల్ : మూడో విడుత జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హాజీపూర్ మండలంలో భారీగా నామినేషన్ల పర్వం ముగిసింది. మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో 156 వార్డులున్నాయి. శుక్రవారం మండలంలో 74 సర్పంచులకు. వార్డు సభ్యులకు 363, మొత్తం 397 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. హాజీపూర్ మండలంలో గడ్ సర్పంచ్ 2, వార్డుసభ్యులకు 11, ర్యాలీ సర్పంచ్ 3, వార్డు సభ్యులకు 11, నాగారంలో సర్పంచ్ 2, వార్డు సభ్యులు 12,చిన్న గోపాల్ సర్పంచ్ 3, వార్డు సభ్యులు 11, వేంపల్లి సర్పంచ్ 7, వార్డు సభ్యులకు 39, ముల్కల్ల సర్పంచ్ 8, వార్డు సభ్యులకు 37, గుడిపేట సర్పంచ్ 4, వార్డు సభ్యులకు 21, నంనూర్ సర్పంచ్ 9, వార్డు సభ్యులకు 22, రాపల్లి సర్పంచ్ 4, వార్డు సభ్యులు 23, కర్నమామిడి సర్పంచ్ 05,వార్డు సభ్యులకు 11, పడ్తన్ సర్పంచ్ 7, వార్డు సభ్యులకు 16, దొనబండ సర్పంచ్ 2, వార్డు సభ్యులకు 20, బుద్దిపల్లి సర్పంచ్ 4, వార్డు సభ్యులకు 17, పెద్దంపేట సర్పంచుకు 4, వార్డు సభ్యులకు 17, హాజీపూర్ సర్పంచ్ 4, వార్డు సభ్యులకు 13, టీకన్నపల్లి సర్పంచుకు 3, వార్డు సభ్యులకు 22 నామినేషన్లు దాఖలా అయ్యాయి. ఇదిలా ఉండగా హాజీపూర్ మండలంలో సర్పంచ్ 81, వార్డు సభ్యులకు 425 నామినేషన్లు దాఖలాలయ్యాయి.
దండేపల్లి : దండేపల్లి మండలంలో చివరిరోజు శుక్రవారం నామినేషన్లు వెల్లువెత్తాయి.

మొదటి, రెండో రోజు అంతంతమాత్రంగానే దాఖలైన నామినేషన్లు చివరి రోజు మంచి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ వేశారు. దండేపల్లి మండలంలోని 31 సర్పంచ్ స్థానాలకు 107 మంది, 278 వార్డు సభ్యుల స్థానాలకు 453 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు సంబంధించి నాగసముద్రం-4, మాకులపేట-4, తాళ్లపేట-3, రాజుగూడ-1,మేదరిపేట-9, మామిడిపెల్లి-7, కొత్తమామిడిపెల్లి-5, లింగాపూర్-4, గుడిరేవు-5, అల్లీపూర్-4, పెద్దపేట-2, లక్ష్మీకాంతాపూర్-8, వెల్గనూర్-11, కాసీపేట-3, ద్వారక-1, కొండాపూర్-1, ధర్మరావుపేట-2, దండేపల్లి-1, కర్ణపేట-1, నర్సాపూర్-4,కొర్విచెల్మ-2, ముత్యంపేట-5, రెబ్బెన్ చెల్కగూడ-5,నంబాల-2,చింతపెల్లి-5, తానిమడుగు-1, వార్డు సభ్యుల స్థానాలకు గాను నాగసముద్రం-18, మాకులపేట-15, తాళ్లపేట-13, రాజుగూడ-12, మేదరిపేట-25, మామిడిపెల్లి-20, కొత్తమామిడిపెల్లి-21, లింగాపూర్-14,గుడిరేవు-12, అల్లీపూర్-5, పెద్దపేట-14, లక్ష్మీకాంతాపూర్-12, వెల్గనూర్-20, కాసీపేట-21, ద్వారక-19, కొండాపూర్-11, ధర్మరావుపేట-12, దండేపల్లి-24,కర్ణపేట-15,నర్సాపూర్-20, కొర్విచెల్మ-28, ముత్యంపేట-16, రెబ్బెన్ నంబాల-19, కన్నేపల్లి-13, చింతపెల్లి-23, తానిమడుగు-8, దండేపల్లి-24 మొత్తం 100 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.మొదటిరోజు సర్పంచ్ 12 నామినేషన్లు, రెండవరోజు 46, మొత్తం58, వార్డు సభ్యులకు మొదటిరోజు 12, రెండవ రోజు 100 మొత్తం 112 దాఖలయ్యాయి. చివరి రోజు సర్పంచ్ సభ్యులకు-107మంది, వార్డు సభ్యుల స్థానాలకు-453 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండో, చివరిరోజు నామినేషన్లు కలిపి సర్పంచ్ స్థానాలు మొత్తం-165 మంది, వార్డు సభ్యులు మొత్తం - 565మంది నామినేషన్లు దాఖలయ్యాయి. గూడెం, వందుర్ నెల్కివెంకటాపూర్ గ్రామాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...