ఓటరుగా నమోదు చేయించాలి


Sat,January 19, 2019 01:46 AM

- బీఎల్వోలకు హాజీపూర్, జన్నారం తహసీల్దార్ల ఆదేశం
మంచిర్యాల రూరల్ : ఈ నెల 20న అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని అధికారులను మంచిర్యాల తహసీల్దార్ రామచంద్రయ్య ఆదేశించారు. శుక్రవారం మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటరు జాబితా నందు పేరు ఉండి పేరు మిస్ అయిన వారు కూడా ఫారం-6 ైక్లెమ్ ద్వార తమ పేరును నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కాంపెయిన రోజు బీఎల్ సంబంధిత పోలింగ్ బూత్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫారం-6 పేరును చేర్చుటకు, ఫారం-7 తొలగించుటకు, ఫారం-8 పేరు సవరణకు,ఫారం-8ఎ ద్వార పోలింగ్ స్టేషన్ మార్చుకొనుటకు ఫారాలను నింపి సంబంధిత బూత్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. ఆయా సంబంధిత పోలింగ్ కేంద్రాలలో బూత్ అధికారులు 20వ తేదిన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందు బాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన యువతీ,యువకులు తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సీనియర్ అస్టిటెంట్ గడియారం శ్రీహరి, తదితరులున్నారు.
జన్నారం : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని మీటింగ్ హల్ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్ కార్యకర్తలతో సమావేశాన్ని స్థానిక తహసీల్దార్ రాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని మంచి అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణారాణీ ,అంగన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...