దైవ సాక్షిగా..


Fri,January 18, 2019 12:23 AM

- అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అసెం బ్లీ సమావేశాల సందర్భంగా గురువారం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రా వు, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్ ప్రమాణం చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి న సుమన్ అసెంబ్లీకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చెన్నూర్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని వెల్లడించారు. బెల్లంపల్లి శాసనసభ్యు డు దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యేలు ది వాకర్‌రావు సైతం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు నమస్తే తెలంగాణతో తమ అనుభూతిని పంచుకున్నారు.

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా..
అసెంబ్లీలో తొలిసారి ప్ర మాణం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మొద టి రోజు అసెంబ్లీలో నేతల ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎంపీగా ఉన్న నన్ను రాష్ట్రానికి సేవ చేసేందుకుముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి తీసుకువచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. సిరిసిల్ల, సిద్ధిపేటలా చెన్నూర్‌ను తీర్చిదిద్దుతా. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపిస్తా.
- బాల్క సుమన్, చెన్నూర్ ఎమ్మెల్యే

అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతా
మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా. సాగునీరు, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టిపెడతా. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు సాగుతాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి, సంక్షేమంలో మంచిర్యాలను ముందు వరుసలో నిలబెట్టేలా అవసరమైన చర్యలు తీసుకుంటా. నేను నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మిగితా పార్టీలన్నింటిని మట్టి కరిపించి టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టినందుకు ప్రజలందరికి ధన్యవాదాలు.
-నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే

ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా
రెండోసారి ఎమ్మెల్యేగా ప్ర మాణం చేయడం చాలా సంతోషమనిపించింది. ప్ర జల ఆకాంక్ష మేరకు పనిచే స్తాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతో మే లు చేస్తున్నాయి. అందుకే ప్రతి పథకం ప్రతి లబ్ధిదారుడికి చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అన్నింటా ముందుంచేలా చ ర్యలు తీసుకుంటా. మారుమూల ప్రాంతాలకు పూర్తిస్థాయిలో రవాణా, వైద్య సదుపాయాలు అందేలా తగిన చర్యలు తీసుకుంటా. ప్రణాళికతో ముందుకు వెళ్తూ పేద ప్రజల కండ్లలో ఆనందం చూసేందుకు అన్ని రకాల కృషిచేస్తా.
- దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...