మార్చి చివరికల్లా తాగునీరివ్వాలి


Fri,January 18, 2019 12:21 AM

మంచిర్యాల రూరల్: మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ నీటి పారుదల, మిషన్ భగీరథ గ్రిడ్‌లు సంయుక్తంగా పని చేస్తూ మార్చి చివరికల్లా ఇం టింటికీ తాగునీరివ్వాలని కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో మిషన్ భగీరథ అధికారులతో గురువా రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 678 గ్రామాలకు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు 567 ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు గాను 236 పూర్తయ్యాయన్నారు. మిగతా వాటిని మార్చి 30వ తేదీ నాటికి పూర్తి చేసి తాగునీరందించా లని సూచించారు. జిల్లాలో మొత్తం పైప్‌లైన్ 2,204 కిలో మీటర్లు ఉండగా ఇప్పటి వరకు 1763 మేర పూర్తయిందనీ, మిగిలిన 441 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో పాటు మొత్తం లక్షా 61 వేల నివాసాలు ఉండగా లక్షా 50 వేలు పూర్త యినట్లు చెప్పారు. మిగితా లక్ష్యాలతో పాటు నిరంతరాయంగా నీరందించేందుకు ఫిబ్రవరి 15వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి, కడెం ప్రాజె క్టులు, ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్టు ద్వా రా తాగునీరందించాలన్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలకు, కడెం ప్రాజెక్టు జన్నారం, దండేపల్లి మం డలాలకు తాగునీరు అందించాలనీ, బెల్లంపల్లి నియోజకవర్గానికి అడ ప్రాజెక్టు ద్వారా తాగు నీరందించేందుకు 80 శాతం మిషన్ భగీరథ ప నులు పూర్తయినట్లు తెలిపారు. మిగతా వాటికి రోజువారీగా, వారాల వారీగా సంబంధిత డీఈలు, ఏఈలు ముందస్తుగా జిల్లా స్థాయిలో తగిన ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని పనులు పర్యవేక్షణతో పాటు నివేదిక పంపించాలన్నారు. మారుమూల గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వడం తో పాటు మండల, నియోజకవర్గ స్థాయిలో గుత్తేదారులు సమన్వయంతో పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ఎస్‌ఈ జ్ఞానకుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ అంజన్‌రావు, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారి రవీందర్, డీఈ వెంకటేశ్, డీఈ విద్యాసాగర్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...