108 గంటలు


Tue,January 15, 2019 05:35 AM

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సం బంధించి ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారానికి కేవలం నాలుగు రోజులు అంటే 108 గంటలు మాత్రమే సమయం ఉండడంతో అ భ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం గుర్తులు కేటాయించడంతో ప్ర చా రాన్ని మరింత ఉధృతం చేశారు. పండుగ రోజులు కావడంతో ప్రచారానికి కలిసివస్తోంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తు పట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు సర్పం చ్, ఇటు వార్డు అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఉ న్న ఆరు రోజులు వినియోగించుకోవాలని ప్రతి ఓటరును ప్ర సన్నం చేసుకునే దిశగా వారు ముందుకు సాగుతున్నారు.

గ్రామాల్లో ఎన్నికల వేడి..
పలు గ్రామాల్లో పోటీ హోరాహోరీగా ఉండడంతో గ్రామాల్లో అభ్యర్థులు ఓటరును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గెలిచేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే గుర్తులకు సంబంధించి పాంప్లెంట్స్‌ను పట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు.

మహిళా, కుల సంఘాల ప్రసన్నం..
గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల సభ్యులు, కూలీలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నా రు. కుల సంఘాల ద్వారా ఓట్లను కొల్లగొట్టేందుకు పథక రచ న చేస్తున్నారు. కుల పెద్దలను కలిసి సంఘానికి ఏం చేస్తామ నే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచా యతీలో మహిళా సంఘాల ఓట్లూ కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే వారిని కలిసిన అభ్యర్థులు, వారి మద్దతుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఓట్లను ప్రసన్నం చేసుకుంటే తమ గెలుపు సగం ఖాయం అనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు.

సోషల్ మీడియా వేదికగా..
పల్లె ఎన్నికల ప్రచారంలో మొదటిసారి సామాజిక మా ధ్యమాలు కూడా వేదికగా మారాయి. గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ముఖ్యంగా వాట్సప్, ఫేస్ బుక్‌ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందు కోసం స్థానికంగా కొంత మేర అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకున్నారు. వారి ద్వారా తమ గుర్తును ఆకర్షణీయంగా రూపొందించి ప్రజలకు చేరువయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థులు అయితే మొబైల్ బల్క్ ఆడియో మెసేజ్ ద్వారా తమ గుర్తును ప్ర చారం చేసుకునే కాకంట్రాక్టు మాట్లాడుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.

ఖర్చుపై నజర్..
గతంలో జరిగిన ఎన్నికల్లో విచ్చలవిడిగా కొంత మంది ఖ ర్చు చేశారు. వారు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. న్యాయ సంబంధ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తిరిగి పోటీ చేసే అవకాశాలు కూడా కోల్పోయారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఐదు వేలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ. 2.5 లక్షలు, వార్డు సభ్యుడు రూ. 50 వేలు, ఐదు వేల లోపు ఉన్న ఓట్లు ఉన్న గ్రామ పం చాయతీలో సర్పంచ్ అభ్యర్థులు రూ. 1.5 లక్షలు, వార్డు స భ్యుడు కేవలం రూ. 30 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉం టుంది. ఖర్చు వివరాల నమోదుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...