రెండో విడతలో 2921 నామినేషన్లు


Mon,January 14, 2019 03:23 AM

-చివరి రోజు కావడంతో బారులు తీరిన అభ్యర్థులు
-రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల పర్వం
మంచిర్యాల ప్రతినిధి నమస్తే తెలంగాణ: రెండో విడత పర్వం ముగిసింది. దీనికి పెద్ద ఎత్తున నా మినేషన్లు దాఖలయ్యాయి. ఐదు మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్ల ఘట్టానికి ఆదివారం చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున బారులు తీరా రు. ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా చివరి రోజైన ఆదివా రం మొత్తం 2921 నామినేసన్లు దాఖలయ్యా యి. సర్పంచ్ 736, వార్డు సభ్యులకు 2185 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

మండలాల వారిగా..
మందమర్రి మండలంలో 347 నామినేషన్లు దాఖలవగా ఇందులో సర్పంచ్ 92, వార్డు సభ్యులకు 255, చెన్నూర్ సర్పంచ్ 187, వార్డు సభ్యులకు 521, కోటపల్లిలో సర్పంచ్ 173, వార్డులకు 492, జైపూర్ సర్పంచ్ 189, వార్డు సభ్యులకు 652, భీమారంలో స ర్పంచ్ 95, వార్డు సభ్యుల స్థానాలకు 265 నా మినేషన్లు దాఖలయ్యయి.
పది జీపీలు ఏకగ్రీవం
రెండో విడత నామినేషన్లు ముగిసిన అనంత రం జిల్లాలో నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కోటపల్లి మండలంలో షట్ బొప్పారం, ఎసన్వాయి, చెన్నూర్ మండలంలో లంబడిపల్లి, బుద్దారం గ్రామపంచాయతీ సర్పం చ్, వార్డు సభ్యుల స్థానాలకు సింగిల్ డిజిట్ నామినేషన్ దాఖలవడంతో ఏకగ్రీవమైనట్లు అధికారు లు ప్రకటించారు. నాలుగు గ్రామపంచాయతీల్లో కోటపల్లి మండలంలో బొప్పారం, ఎసన్వాయి, చెన్నూర్ మండలంలో లంబడిపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవం వైపు గ్రామస్తులు మొగ్గు చూ పారు. ఉప సంహరణ ప్రకియ వరకు మరిన్ని గ్రా మపంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉండగా సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...