ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు


Mon,January 14, 2019 03:20 AM

- బాలుర విజేత హైదరాబాద్,రన్నరప్ వరంగల్బాలికల విజేత వరంగల్
- జిల్లా బాలుర జట్టుకు తృతీయస్థానం
- క్రీడాకారులకు విద్య,ఉద్యోగావకాశాలు
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్
మంచిర్యాల స్పోర్ట్స్ : మంచిర్యాల జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. టోర్నీలో బాలుర విభాగంలో హైదరాబాద్ విజేతగా నిలవ గా, వరంగల్ జట్టు రన్నరప్ నిలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికలవిభాగంలో వరంగల్ విజేతగా నిలవగా, నల్గొండ రన్నరప్ నిలిచింది. ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేకానంద మాట్లాడారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రత్యేక గుర్తింపుతోపాటు విద్యా, ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపే వారుంటే, ప్రోత్సహించే వారు కూడా ఉం టారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా సామగ్రి అందించనుందని మంచిర్యాల ఎ మ్మెల్యే దివాకర్ అన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రజా ప్రతినిధులు, సింగరేణి ఎప్పుడు ముందుంటుందని టీబీజీకేఎస్ అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. బాలురలో హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జట్లు తొలి మూడు స్థానాల్లో నిలవగా, నల్గొండ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. బాలికల్లో వరంగల్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జ ట్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ప్రథమ స్థానం సాధించిన జట్లకు రూ. 15 వేల నగదు, ట్రోఫీ, మెడల్స్, రెండో స్థానంలో నిలిచిన జట్లకు రూ. 10 వేల నగదు, ట్రోఫీ, మెడల్స్, మూడు, నాలుగో స్థానం సాధించిన జట్లకు ట్రోఫీతోపాటు రూ. 5 వేల నగదు అందించారు. నగదు బహుమతి చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పాన్సర్ చేయగా, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించారు. పోటీలకు కన్వీనర్ మంచిర్యాల పట్టణ సీఐ మహేశ్, జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి రఘునాథ్ నడిపెల్లి విజిత్, శ్రీరాంపూర్ టీబీజీకేఎస్ నాయకుడు సురేందర్ మోహన్ రాష్ట్ర వాలీబాల్ సంఘం పరిశీలకుడు సుధీర్ క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...