మందమర్రి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి


Mon,January 14, 2019 03:20 AM

మందమర్రి : మందమర్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏఈ అచ్యుత్, టీఆర్ నాయకులతో సమావేశమై అభివృద్ధి పనుల పై చర్చించారు. ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముందుగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన టెండర్లు, వాటిని పొందిన ఏజెన్సీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ నెలాఖరులోగా నిర్మాణం చేపట్టనున్న స్థలాలను ఆయన సందర్శించారు. స్థానిక గాంధీనగర్ సమీపంలో ఉద్యానవన నిర్మాణానికి స్థలం అనువుగా ఉందని నాయకులు సూచించడంతో ఆ స్థలాన్ని పరిశీలించారు. అలాగే స్టేషన్ రోడ్డు, పాలచెట్టు వద్ద క్లాక్ టవర్ నిర్మాణ ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ. 22 కోట్లతో నిర్ధేశిత పనులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఊరు మందమర్రి చెరువుపై మినీ ట్యాంక్ పాతబస్టాండ్ నుంచి సుభాష్ వరకు కోల్ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు జంక్షన్ల నిర్మాణం, వైకుంఠ ధామాల నిర్మాణం, మహానీయుల విగ్రహాల ఏర్పాటు, వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. జంక్షన్ వాటర్ ఫౌంటేయిన్ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. క్లాక్ టవర్, క్రిస్టియన్, ముస్లిం వైకుంఠ ధామా లు, స్టేషన్ రోడ్డు నిర్మాణం పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తునట్లు తెలిపారు. ఆయన వెంట టీఆర్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...