ప్రజలే స్నేహితులు


Mon,January 14, 2019 03:19 AM

-బెల్లంపల్లి ఏసీపీ బాలూజాదవ్
-కమ్యూనిటీ పోలీసింగ్ సిబ్బందికి అవగాహన
బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ: పోలీసులకు ప్ర జలే స్నేహితులని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ అన్నారు. బాలాజీ మినీ ఫంక్షన్ కమ్యూనిటీ పోలీసింగ్ ఆదివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. డీజీ ఆదేశాలతో పోలీసుల పనితీరులో ప్రక్షాళన జరిగిందన్నారు. పోలీసు శాఖలో ఒకేపని తీరు-ఒకే విధానాన్ని ఇ ప్పటి నుంచి అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రజలతో అన్ని స్థాయిల సిబ్బంది ఒకే తీరుగా మెలు గుతూ స్నేహ పూర్వకంగా, మర్యాదగా వ్యవహరించాలన్నారు. సమస్యలు పరిష్కరించుకునేందు కు వచ్చే ప్రజలను పోలీసులు అక్కున చేర్చుకుని ఆప్యాయంగా మాట్లాడాలని చెప్పారు. వారి సమస్యలను శ్రద్ధగావిని మర్యాద పూర్వకంగా వ్యవహరించి విశ్వాసాన్ని పొందాలన్నారు. ప్రజలకు సత్వ ర న్యాయం అందించే దిశగా పోలీసులు పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలను ప్రాథమిక దశ లో పరిష్కరించేలా చొరవ చూపినప్పుడే సమస్య లు తవ్రరూపం దాల్చకుండా పరిష్కారమవుతాయన్నారు. ఇతర రాష్ర్టాల వారికి తెలంగాణ పోలీసుల పనితీరు స్ఫూర్తి గా నిలవాలన్నారు. యూనిఫారం సర్వీస్ డెలవరీ అనే కొత్త విధానంతో 2019 నుంచి తెలంగాణ పోలీసులు నూతన పనితీరుకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. వన్ న్ ఎస్ రాములు, సీఐ నరేందర్, తాళ్లగురిజాల ఎస్ కిరణ్ పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...